Breaking News

ప్రజారాజధాని అమరావతిలో రూ.1,328 కోట్ల పెట్టుబడులు..6,541 ఉద్యోగాలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజారాజధాని అమరావతి మరో కీలక కార్యక్రమానికి వేదిక కానుంది. ఆర్థిక కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా అమరావతిని తీర్చిదిద్దే కార్యాచరణలో భాగంగా ఈ నెల 28న రాజధానిలోని సిఆర్డిఏ కార్యాలయం వద్ద 15 బ్యాంకుల ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన జరగనుంది. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ మరియు ఇతర ప్రముఖ ప్రజాప్రతినిధుల సమక్షంలో బ్యాంకుల కార్యాలయాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. రాజధాని అమరావతిని ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రంగా అభివృద్ధి చేసే “ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్” బృహత్ ప్రణాళికలో భాగంగా సిఆర్డిఏ ఆధ్వర్యంలో ఇప్పటికే ఈ బ్యాంకులకు అవసరమైన భూముల కేటాయింపు పూర్తయ్యింది. రాజధాని అమరావతిలోని ఉద్ధండరాయునిపాలెం, వెలగపూడి, రాయపూడి, లింగాయపాలెంలో ఈ బ్యాంకుల ప్రధాన కార్యాలయాలు కొలువుదీరనున్నాయి. మొత్తంగా ఈ యొక్క 15 బ్యాంకుల ద్వారా రూ.1,328 కోట్ల పెట్టుబడులు తద్వారా 6,541 ఉద్యోగాల కల్పన మన రాజధాని అమరావతిలో జరగనుంది.

ప్రతిపాదిత పెట్టుబడులు మరియు ఉద్యోగాల వివరాలు:
ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్- రూ.256 కోట్లు- 1,000 ఉద్యోగాలు
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- రూ.40 కోట్లు- 300 ఉద్యోగాలు
ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (ఆప్కాబ్)- రూ.200 కోట్లు- 400 ఉద్యోగాలు
బ్యాంక్ ఆఫ్ ఇండియా(BOI)- రూ.40 కోట్లు- 200 ఉద్యోగాలు
కెనరా బ్యాంక్- రూ.50 కోట్లు- 300 ఉద్యోగాలు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)- రూ.300 కోట్లు- 2,000 ఉద్యోగాలు
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(UBI)- రూ.50 కోట్లు- 160 ఉద్యోగాలు
బ్యాంక్ ఆఫ్ బరోడా- రూ.60 కోట్లు- 300 ఉద్యోగాలు
ఇండియన్ బ్యాంక్- రూ.40 కోట్లు- 105 ఉద్యోగాలు
నాబార్డ్ (నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్)- రూ.90 కోట్లు- 160 ఉద్యోగాలు
పంజాబ్ నేషనల్ బ్యాంక్(PNB)- రూ.15 కోట్లు- 150 ఉద్యోగాలు
ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్(IOB)- రూ.4 కోట్లు- 65 ఉద్యోగాలు
ఐడీబీఐ బ్యాంక్- రూ.50 కోట్లు- 215 ఉద్యోగాలు
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)- రూ.22 కోట్లు- 1,036 ఉద్యోగాలు
న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్(NIACL)- రూ.93 కోట్లు- 150 ఉద్యోగాలు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *