Breaking News

ప్రతిభకు పేదరికం అడ్డుకాకూడదనే ఎస్సి, ఎస్టీ నిరుద్యోగ అభ్యర్థులకు ఉచిత సివిల్స్ శిక్షణ ఇస్తున్నాం

-ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాల్ని అందిపుచ్చుకుని కష్టపడి చదివి అనుకున్న లక్ష్యాలు సాధించాలి
-ఎస్సి,ఎస్టీ యువత అభ్యున్నతికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారు
-మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి
-విజయవాడ అంబేద్కర్ స్టడీ సర్కిల్ లో మంత్రి డిఎస్ బీవీ ఆకస్మిక తనిఖీ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాల్ని అందిపుచ్చుకుని నిరుద్యోగ యువత కష్టపడి చదివి అనుకున్న లక్ష్యాలు సాధించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. గురువారం విజయవాడ అంబేద్కర్ స్టడీ సర్కిల్ లో మంత్రి డిఎస్ బీవీ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్టడీ సర్కిల్లో సిబ్బంది బోధన తీరు, అభ్యర్థులకు అందుతున్న సౌకర్యాలు మంత్రి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ…విద్య ద్వారానే సమాజంలో పేదరికాన్ని రూపుమాపగలం. ప్రతిభకు పేదరికం అడ్డుకాడదనే రాష్ట్రంలో 340 మంది ఎస్సి, ఎస్టీ నిరుద్యోగ అభ్యర్థులకు ఉచిత సివిల్స్ శిక్షణ ఇస్తున్నాం. శిక్షణ కాలంలో శిక్షణతో పాటు మెటీరియల్, వసతి భోజనం ఉచితంగా అందిస్తున్నాం. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాల్ని అందిపుచ్చుకుని కష్టపడి చదివి అనుకున్న లక్ష్యాలు సాధించాలి. రాష్ట్రంలో నిరుద్యోగాన్ని రూపు మాపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్, దేశ విదేశాలు తిరిగి పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకొచ్చి యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించడంతోపాటు ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తున్నారు. ఎస్సి, ఎస్టీ యువత అభ్యున్నతికి సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పాఠశాల బస్సు డ్రైవర్లు నిబద్ధతతో విధులు నిర్వహించాలి

-విద్యార్థుల భద్రత డ్రైవర్లపై ఉన్న అత్యంత కీలక బాధ్యత -డ్రైవర్లు విధిగా యూనిఫామ్ ధరించాలి -డ్రైవింగ్ నైపుణ్యంతో పాటు మంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *