Breaking News

అరకులో సందడి చేసిన మంత్రి కందుల దుర్గేష్

-హోమ్ స్టే ఆతిథ్యానికి ఫిదా.. గిరిజనులతో కలిసి ఆనందంగా డ్యాన్స్ వేసిన మంత్రి దుర్గేష్

అరకు వ్యాలీ, నేటి పత్రిక ప్రజావార్త :
అల్లూరి సీతారామరాజు జిల్లా: అరకు ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వ్యాలీ సమీపంలోని చొంపి గ్రామంలో పర్యటించి సందడి చేశారు. కూటమి ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన హోమ్ స్టే పాలసీ అమలు తీరును ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్, జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

హోమ్ స్టే ఆతిథ్యం అద్భుతం: మంత్రి కందుల దుర్గేష్

చొంపి గ్రామంలో ఏర్పాటు చేసిన హోమ్ స్టేలను సందర్శించిన మంత్రి దుర్గేష్, అక్కడ పర్యాటకులకు అందుతున్న వసతులు, గిరిజనుల ఆతిథ్యం గురించి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. గిరిజనులు అందించిన ఆత్మీయ ఆతిథ్యాన్ని స్వీకరించిన మంత్రి దుర్గేష్ వారి ఆత్మీయతకు ముగ్ధులయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ.. “పర్యాటకులు తప్పకుండా సందర్శించాల్సిన అద్భుతమైన ప్రాంతం అరకు. ఇక్కడి హోమ్ స్టేలలో ఆతిథ్యం ఎంతో బాగుంది. పర్యాటకులకు మధురానుభూతిని కలిగించేలా అరకు ఉత్సవాలను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది,” అని పేర్కొన్నారు. హోమ్ స్టే నిర్వాహకులతో మాట్లాడి వారికి పలు సూచనలు చేశారు.

గిరిజనులతో కలిసి స్టెప్పులేసిన మంత్రి దుర్గేష్

అరకు ఉత్సవాల వేళ స్థానిక సంస్కృతిని ప్రతిబింబించేలా మంత్రి కందుల దుర్గేష్ సందడి చేశారు. గిరిజన సాంప్రదాయ వేషధారణతో పాటు, స్వయంగా డప్పు కొట్టి అందరినీ ఉత్సాహపరిచారు. అనంతరం గిరిజన కళాకారులతో కలిసి ఆదివాసీ నృత్యానికి (థింసా) స్టెప్పులేసి గిరిజనుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపారు.

పర్యాటకులతో ముఖాముఖి*

ఉత్సవాలకు వచ్చిన పర్యాటకులతో మంత్రి దుర్గేష్ స్వయంగా మాట్లాడి, వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అరకు అందాలను ఆస్వాదించడంతో పాటు స్థానిక సంస్కృతిని గౌరవించాలని ఆయన కోరారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా గిరిజన ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *