Breaking News

బడ్జెట్–2026 పేదలు, మహిళలు, యువతకు ప్రాధాన్యతనిచ్చిన ప్రజాహిత బడ్జెట్.

– విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ వెల్లడి

ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్–2026 దేశ పేదలు, మహిళలు, యువత అభివృద్ధిని కేంద్రబిందువుగా ఉంచిన సమగ్ర బడ్జెట్ అని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే దిశగా ప్రత్యేక ప్రోత్సాహాలు కల్పించడం ముఖ్య విశేషమని తెలిపారు. ప్రతి కుటుంబంలో కనీసం ఒకరు వ్యాపార రంగంలో ఎదగాలన్న ఆలోచనకు ఈ బడ్జెట్ బలాన్నిస్తోందన్నారు. ఈ దృక్పథం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎప్పటినుంచో చెబుతున్న లక్ష్యాలకు అనుగుణంగా ఉందని చెప్పారు.

చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు ప్రోత్సాహం లభించేలా పలు చర్యలు ప్రకటించారని, ముఖ్యంగా బయో ఔషధాలు, అర్ధవాహక చిప్ తయారీ, కంటైనర్ తయారీ, వస్త్ర యంత్రాల తయారీ రంగాలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా దేశీయ పరిశ్రమలు బలపడతాయని అన్నారు. అరుదైన భూఖనిజాల వినియోగంపై దక్షిణాది రాష్ట్రాలకు, అందులో ఆంధ్రప్రదేశ్‌కు అవకాశాలు కల్పించడాన్ని స్వాగతించారు. చెన్నై–హైదరాబాద్, హైదరాబాద్–బెంగళూరు వేగ రైలు మార్గాల ప్రణాళిక వల్ల ఆంధ్రప్రదేశ్‌కు కూడా ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. మెగా వస్త్ర పార్కులు, ఖాదీ–చేనేత అభివృద్ధి, క్రీడా సామగ్రి తయారీ యూనిట్ల ఏర్పాటు వంటి నిర్ణయాలు ఉపాధి అవకాశాలను విస్తృతం చేస్తాయని చెప్పారు.

ప్రముఖ దేవాలయాలు ఉన్న నగరాల అభివృద్ధికి నిధులు కేటాయించడాన్ని ప్రస్తావిస్తూ, ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ ఆలయంతో ప్రసిద్ధిగాంచిన విజయవాడకు ఇది ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. పర్యాటక రంగం అభివృద్ధితో దేశవ్యాప్తంగా వేలాది మందికి మార్గదర్శకులుగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు.

క్రీడా రంగంలో ఆటగాళ్లతో పాటు శిక్షకులు, వైద్య నిపుణులు, సహాయక సిబ్బంది తయారీకి దోహదపడే విధంగా చర్యలు తీసుకోవడం హర్షణీయమని చెప్పారు. దేశంలోనే క్రీడా సామగ్రి తయారీ పెంపుకు ఈ బడ్జెట్ దోహదం చేస్తుందని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ 2047 లక్ష్యాలను ప్రతిబింబించే విధంగా ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రసంగం సాగిందని పేర్కొన్నారు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యంగా పెట్టుకున్న వికసిత్ భారత్–2047 దిశగా ఈ బడ్జెట్ బలమైన అడుగని, భారత్‌ను ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే దిశగా ఇది ఉపయుక్తమవుతుందని ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *