
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో వారసత్వ ఫ్యాషన్ కోసం ఒక కొత్త గమ్య స్థానం ‘శ్రీవిద్య లగ్జరీ షోరూమ్’ ఆవిష్కృతమైంది. శుక్రవారం బందరురోడ్డులో అత్యంత ప్రీమియం షోరూమ్ ‘శ్రీవిద్య లగ్జరీ షోరూమ్’ను సినీనటి పాయల్ రాజ్పుత్ ప్రారంభించగా గౌరవ అతిథిగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ఈ సండర్భంగా సినీనటి పాయల్ రాజ్పుత్ మాట్లాడుతూ… తనకు చీరల సొగసు శాశ్వతత్వం అంటే ఎప్పుడూ చాలా ఇష్టమన్నారు. శ్రీవిద్య కలెక్షన్ నిజంగా మంత్రముగ్ధులను చేసేలా వుందన్నారు. ముఖ్యంగా సాంప్రదాయ నేతలను ఆధునిక సొగసుతో మిళితం చేసిన విధానం అద్భుతమన్నారు. ఈ ప్రారంభోత్సవం కోసం విజయవాడకు రావడం, ఇంతటి అద్భుతమైన దుస్తులను ఒకే చోట చూడటం తనకు చాలా ఆనందంగా వుందని తెలిపారు. అనంతరం ‘శ్రీవిద్య లగ్జరీ షోరూమ్’ వ్యవస్థాపకులు ఓం ప్రకాష్ దేవాసి మాట్లాడుతూ… శ్రీవిద్య 2015లో గుంటూరులో ప్రారంభమైందన్నారు. హస్తకళ, సంప్రదాయాన్ని ఎల్లప్పుడూ గౌరవించాలన్నారు. విజయవాడ తమకు ఒక సహజమైన ముందడుగులా అనిపించిందన్నారు. ఎందుకంటే, ఇది పట్టు, సంస్కృతి, కుటుంబ సంప్రదాయాలకు విలువనిచ్చే నగరం అన్నారు. ఈ షోరూమ్ మా ప్రస్థానాన్ని, వారసత్వాన్ని చాటిచెబుతూనే, మహిళకు కూడా సముచితంగా ఉండేలా కలెక్షన్లను అందించాలనే మా నిబద్ధతను ప్రతిబింబిస్తుందని తెలిపారు. ప్రారంభోత్సవం సందర్భంగా కొనుగోలుదారులకు ప్రత్యేక డిస్కౌంట్ను కూడా అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు, వస్త్రాభిమానులు, బంధుమిత్రులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News