గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా స్త్రీ మరియు శిశు అభివృద్ధి సంస్థ, గుంటూరు వారి ఆధీనములోని మిషన్ శక్తి స్కీమ్ క్రింద వన్ స్టాప్ సెంటర్ లో ఖాళీగా ఉన్న 14 పోస్టులకు అనగా సెంటర్ అడ్మినిస్ట్రేటర్ (1), కేసు వర్కర్ (2), ప్యారా లీగల్ పర్సనల్/లాయర్ (1), ప్యారా మెడికల్ పర్సనల్ (1), సైకో సోషల్ కౌన్సిలర్ (2), ఆఫీస్ అసిస్టెంట్ విత్ కంప్యూటర్ పరిజ్ఞానము (1), మల్టీ పర్పస్ స్టాఫ్ (3), సెక్యూరిటీ గార్డ్ (3) కాంట్రాక్టు పద్ధతిపై పని చేయుటకు మహిళా అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరటమైనది.
దరఖాస్తులు కార్యాలయ పని వేళలలో తేది : 25-02-2026 ఉదయము 10:30 గంటల నుండి తేది:05-03-2026 సాయంత్రం 5:00 గంటల వరకు స్వీకరించబడును. పోస్టుల పూర్తి వివరముల కొరకు గుంటూరు జిల్లా అధికారిక వెబ్ సైట్ లో కానీ, ఈ దిగువ తెలిపిన కార్యాలయమును సంప్రదించవలసినదిగా కోరడమైనది.
కార్యాలయము అడ్రస్: జిల్లా స్త్రీ & శిశు సంక్షేమ & సాధికారత అధికారి,
జిల్లా స్త్రీ మరియు శిశు అభివృద్ధి సంస్థ,
స్వశక్తి భవన్, కలెక్టర్ బంగళా రోడ్,
గుంటూరు – 522 004
Prajavartha Online Telugu News