గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
మంగళవారం కలెక్టరేట్ లోని ఎస్ ఆర్ శంకరన్ మినీ సమావేశమందిరంలో జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా రాజకీయపార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో అమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి డా. టి సేవా కుమార్, బహుజన సమాజ్ పార్టీ ప్రతినిధి చిరతనగండ్ల వాసు, భారతీయ జనతా పార్టీ ప్రతినిధి వైవీ సుబ్బారావు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి కే కే గుప్తా, తెలుగుదేశం పార్టీ ప్రతినిధి ఎన్ ఓంకార్, జనసేన పార్టీ ప్రతినిధి సీహెచ్ త్రినాధ్ పాల్గొన్నారు. ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ , డెమోగ్రాఫికల్ సిమిలర్ ఎంట్రీస్, క్లైయిమ్స్ పరిష్కారం నియోజకవర్గాల వారీగా వివరాలను తెలిపారు, ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ను వేగవంతం చేయాలని, రానున్న మూడు రోజుల్లో ప్రోగ్రెస్ ను మరింతగా పెంచేలా ఈఆర్వోలు పర్యవేక్షించాలన్నారు. డెమోగ్రాఫికల్ సిమిలర్ ఎంట్రీస్ నిర్దేశిత మార్గదర్శకాలు పాటిస్తూ నూరుశాతం పూర్తి చేయాలన్నారు. బూతు లెవల్ అధికారులు రాజకీయ పార్టీల ప్రతినిధులకు, ప్రజలకు ఓటరు జాబితాలకు సంబంధించిన వివరాలు అందించేలా అవసరమైన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
సమావేశంలో రెవెన్యూ అధికారి ఎన్ ఎస్ కే ఖాజావలి , ఈఆర్వోలు డిప్యూటీ కలెక్టర్ గంగరాజు, తెనాలి ఇన్చార్జి సబ్ కలెక్టర్ లక్ష్మీ కుమారి, నగరపాలక సంస్థ అదనపు కమిషనరు చల్లా ఓటులేసు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాసులు,ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ మల్లేశ్వరి పాల్గొన్నారు,
Prajavartha Online Telugu News