గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కలెక్టరేట్ ఆవరణలోని ఇ.వి.యం గోడౌన్ ను నెలవారీ తనిఖీల్లో భాగంగా జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా మంగళవారం తనిఖీ చేశారు. గోడౌన్ కు వేసిన తాళాల సీళ్ళు , సీసీ కెమెరాల డిసిప్లే , ప్రాంగణంను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇ.వి.యం గోడౌన్ భద్రత విషయంలో రాజీ లేకుండా అవసరమైన అన్ని చర్యలు నిరంతరం పటిష్టంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలి, అగ్నిమాపక శాఖ అధికారి కృష్ణా రెడ్డి, సమాచార పౌర సంబంధాల శాఖ ఉప సంచాలకులు లోచర్ల రమేష్, ఆర్ అండ్ బీ డిప్యూటీ ఎస్ఈ హజరతయ్య, ఆర్ అండ్ బీ ఎలక్ట్రికల్ డీఈ కాళిమాత, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు మల్లీశ్వరి, ఎపీఎస్పీ బెటాలియన్ ఎఆర్ఎస్ఐ బాల కృష్ణా రెడ్డి పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News