Breaking News

27న డి.ఆర్.డి.ఏ సీడాప్ జాబ్ మేళా

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగ కల్పన మరియు వ్యవస్థాపకభివృద్ధి సంస్థ (SEEDAP) అధ్యర్యంలో ఈ నెల 27వ జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని డి.ఆర్.డి.ఏ పథక సంచాలకులు వి.విజయలక్ష్మి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కేఫ్ కాఫీ డే సంస్థలో టీం మెంటెర్ మరియు 150 ఉద్యోగాలు ఉన్నాయని, ఇంటర్, డిగ్రీ చదివి, 18 నుండి 35 సంవత్సరాల వయస్సు గల వారు అర్హులన్నారు. వేతనం రూ.15 వేల నుండి 17 వేల వరకు ఉంటుందని చెప్పారు. ఇంటర్వ్యూలు గుంటూరు జిల్లా కలెక్టర్ బంగ్లా రోడ్ లో ఆర్ అండ్ బి అతిథి గృహం ఎదురుగా ఉన్న డి.ఆర్.డి.ఏ – వెలుగు ఆఫీస్ లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వివరాలకు 6302096189 ఫోన్ నంబరుకు సంప్రదించవచ్చని వివరించారు. ఆసక్తి కలిగిన యువతీ యువకులు, సంబందిత విద్యార్హత సర్టిఫికెట్లు నకలు, రేషన్ కార్డు జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, పాస్ పోర్ట్ సైజు ఫోటోలతో 27వ తేదీ ఉదయం10 గంటలకు ఇంటర్వ్యూకు హాజరు కావాలని కోరారు. గుంటూరు జిల్లా యువతీ యువకులు ఈ జాబ్ మేళాలో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *