Breaking News

ఎం ఎస్ ఎం ఈ రంగంలో గ్రీన్ ఇన్వెస్ట్‌మెంట్‌ను ప్రోత్సహించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం

-కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన మరియు ఎంఎస్ఎంఈ (సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల) శాఖల సహాయ మంత్రి సుశ్రీ శోభా కరంద్లాజే
-ఎం ఎస్ ఎం ఈ గ్రీన్ ఇన్వెస్ట్‌మెంట్ పథకం వివరాలపై ఎంపీ కేశినేని శివనాధ్ అడిగిన ప్రశ్నకు సమాధానం వెల్లడించిన కేంద్రం

న్యూ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎస్ ఎం ఈ రంగంలో గ్రీన్ ఇన్వెస్ట్‌మెంట్‌ను ప్రోత్సహించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం అని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన మరియు ఎంఎస్ఎంఈ (సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల) శాఖల సహాయ మంత్రి సుశ్రీ శోభా కరంద్లాజే తెలిపారు. ఎం ఎస్ ఎం ఈ గ్రీన్ ఇన్వెస్ట్‌మెంట్ పథకం వివరాలపై గురువారం లోకసభలో ఎంపీ కేశినేని శివనాధ్ (చిన్ని )అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. ఎం ఎస్ ఎం ఈ రంగంలో గ్రీన్ ఇన్వెస్ట్మెంట్లను ప్రోత్సహించడం తద్వారా పర్యావరణానికి అనుకూలమైన సాంకేతికతలను చిన్న పరిశ్రమల్లో విస్తరించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పని చేస్తున్నట్లు మంత్రి వివరించారు.

సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలకు గ్రీన్ టెక్నాలజీ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు అమలు చేస్తున్న ఎం ఎస్ ఈ – గ్రీన్ ఇన్వెస్ట్మెంట్, ఫైనాన్స్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ స్కీం (MSE-GIFT) పథకం అమలు వివరాలను కేంద్ర మంత్రి వివరించారు. మంత్రి తెలిపిన వివరాల ప్రకారం, ఈ పథకం కింద మొత్తం రూ.353 కోట్ల నిధులు కేటాయించగా, ఇప్పటివరకు రూ.14.47 కోట్లు వినియోగించినట్లు వెల్లడించారు. ఇందులో ఇంటరెస్ట్ సబ్వెన్షన్ కాంపోనెంట్‌కు రూ.350 కోట్లు కేటాయించగా, రూ.13.22 కోట్లు ఖర్చు అయ్యాయన్నారు . ఇక ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్ (IEC) కార్యక్రమాల కోసం రూ.3 కోట్లు కేటాయించగా, రూ.1.25 కోట్లు వినియోగించారని తెలిపారు.

ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 5,800 యూనిట్లకు లబ్ధి చేకూర్చడం లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు 5,096 సూక్ష్మ మరియు చిన్న పరిశ్రమలు లబ్ధి పొందాయన్నారు. నిధుల విడుదల వివరాలు మంత్రి తెలిపారు. 2025 మార్చి 28న రూ.2.22 కోట్లు, అదే ఏడాది మే 23న రూ.0.27 కోట్లు, జూలై 31న రూ.4.48 కోట్లు, సెప్టెంబర్ 30న రూ.6.19 కోట్లు, అక్టోబర్ 16న రూ.0.06 కోట్లు విడుదలయ్యాయని మంత్రి చెప్పారు.

దేశవ్యాప్తంగా ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 5,096 సూక్ష్మ మరియు చిన్న పరిశ్రమ యూనిట్లు లబ్ధి పొందాయన్నారు . రాష్ట్రాల వారీగా చూస్తే తమిళనాడులో అత్యధికంగా 1,067 యూనిట్లు, తరువాత పంజాబ్ 610, రాజస్థాన్ 608, మహారాష్ట్ర 578, హర్యానా 529 యూనిట్లు ఉన్నాయన్నారు

ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 128 యూనిట్లు ఈ పథకం ద్వారా లబ్ధి పొందాయన్నారు.ఇందులో 2023–24లో 20, 2024–25లో 46, 2025–26లో 62 యూనిట్లు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

ఈ పథకం గురించి పరిశ్రమలకు అవగాహన కల్పించేందుకు కేంద్ర ఎమ్ ఎస్ ఎం ఈ మంత్రిత్వ శాఖ పలు కార్యక్రమాలు నిర్వహించినట్లు మంత్రి తెలిపారు. అమలు సంస్థగా పనిచేస్తున్న Small Industries Development Bank of India (SIDBI) ద్వారా 60 అవగాహన కార్యక్రమాలు, వర్క్‌షాప్‌లు, వెబినార్‌లు, పరిశ్రమల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి పథకం గురించి ప్రచారం చేసినట్లు వెల్లడించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *