Breaking News

ఇక ఉద్యమంగా పీ4

-పేదలకు అండగా నిలిచిన వారికి అవార్డులు
-పీ4 కు ఏడాది పూర్తైన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు
-ఈ అంశంపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీ4 ను కార్యక్రమంలా కాకుండా ఉద్యమ స్థాయికి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని పేదలకు చేయూత ఇచ్చేలా చేపట్టిన ఈ విశిష్ట కార్యక్రమానికి మార్చి 30 తేదీ నాటికి ఏడాది పూర్తి కావొస్తుండటంతో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో కార్యక్రమాలు చేపట్టాలని సీఎం సూచించారు. తొలి ఏడాదిలో ఇప్పటి వరకూ 2.5 లక్షల మంది పేదల జీవితాల్లో వెలుగులు నింపామని, బంగారు కుటుంబాలకు చేయూతను ఇవ్వటంలో ఆదర్శంగా నిలిచిన మార్గదర్శులకు అవార్డులు, ప్రశంసా పత్రాలు ఇవ్వాలని స్పష్టం చేశారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో దీనిపై ప్రణాళికా విభాగం అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో మార్చి 30 తేదీన పీ4 పై ఆయా జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో కార్యక్రమాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. 30 తేదీన తిరుపతిలో రాష్ట్రస్థాయి కార్యక్రమాన్ని చేపట్టేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు. రాష్ట్రస్థాయిలో ఆదర్శ మార్గదర్శి, జ్ఞాన మార్గదర్శి, సామాజిక సహకార మార్గదర్శి పేరిట అవార్డులు ఇవ్వనున్నారు. జిల్లా స్థాయిలో విశిష్ణ మార్గదర్శి పేరిట ఒక అవార్డు, మరో ముగ్గురికి ప్రశంసా పత్రాలు ఇవ్వనున్నారు. నియోజకవర్గ స్థాయిలో ముగ్గురు మార్గదర్శులకు సర్టిఫికెట్లు ప్రదానం చేయనున్నారు. జిల్లా స్థాయిలో జరిగే పీ4 తొలి ఏడాది కార్యక్రమానికి జిల్లా ఇంఛార్జి మంత్రులు, నియోజకవర్గ స్థాయిలో ప్రజాప్రతినిధులు హాజరు కావాలని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆర్ధిక అసమానతలు తొలగించేలా చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్రంలో మిగతా వారికి స్పూర్తిని నింపేలా బంగారు కుటుంబాలు, వారికి చేయూత ఇచ్చిన మార్గదర్శుల కు సంబంధించిన ప్రచార చిత్రాలను కూడా సిద్ధం చేయాలని సీఎం నిర్దేశించారు. వసుదైక కుటుంబం అనే థీమ్ తో గివ్ బ్యాక్ టుది సొసైటీ అనే నినాదంతో విస్తృత ప్రచారం జరగాలన్నారు. రాష్ట్రంలోని ప్రతీ పేద కుటుంబానికీ మెరుగైన జీవన ప్రమాణాలు, భవిష్యత్తును అందించేలా చేపడుతున్న విశిష్ట ఉద్యమంగా పీ4 నిలిచిపోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *