విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో ఆంధ్రప్రదేశ్ కెనరా బ్యాంక్ అప్రైజర్స్ యూనియన్ అభినందన సభ జరిగింది. శనివారం విజయవాడ భవానిపురం శుభమస్తు కళ్యాణ వేదిక నందు ఆలిండియా కెనరా బ్యాంక్ జ్యూయల్ అప్రైజర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీగా ఎన్నికైన ఈదరాడ శ్రీనివాస్ కి ఆంధ్రప్రదేశ్ కెనరా బ్యాంక్ అప్రైజర్స్ యూనియన్ అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈదరాడ శ్రీనివాస్ ని ఘనంగా సత్కరించుకుని సన్మానించారు. తదుపరి వక్తలు ప్రసంగిస్తూ ఈదరాడ శ్రీనివాస్ జ్యూయల్ అప్రైజర్స్ కి అందించినటువంటి సేవలు గుర్తు తీసుకొని అభినందించారు. అందరిని ఒక తాటిపై నడిపిస్తూ కలుపుకొని వెళ్తున్న నాయకులని ఆయనతో కలిసి నడవడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నామన్నారు.
ఈ కార్యక్రమంలో సి బి జి ఏ యు నాయకులు రమేష్ బాబు తణుకు ప్రభాకర్ నరేంద్ర కుమార్ ఏడుకొండలు ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు కె.వి.రంగారావు, సంజయ్ రామ్ సెక్రటరీ, బివి బాబు, వై శ్రీనివాస్ 13 రీజినల్ లో ఉండే అప్రైజర్స్ అందరూ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News