Breaking News

త్వరలో లక్ష మందితో రాష్ట్రంలో సూఫీ కాన్ఫరెన్స్

-ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లిం మత గురువుల రాక
-అంతర్జాతీయ స్థాయిలో రాజధాని అమరావతికి గుర్తింపు రావాలని ప్రత్యేక దువా
-ఈద్ మీలాప్ కార్యక్రమంలో సూఫీ మత గురువులు అల్తాఫ్ బాబా

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
త్వరలో రాష్ట్రంలో అమరావతి కేంద్రంలో లక్ష మందితో సూఫీ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు సూఫీ మత గురువులు మరియు రాష్ట్ర అహలే సున్నతుల్ జమాత్ కన్వీనర్ అల్తాఫ్ బాబా. విజయవాడలో రంజాన్ పండుగ తర్వాత జరుపుకునే
ఈద్ మిలాప్ ను రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫారూఖ్ షూబ్లీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు టిడిపి పోలీట్ బ్యూరో సభ్యులు టీడీ జనార్ధన్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అల్తాఫ్ బాబా మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయిన తర్వాత మొట్ట మొదటిసారిగా ఈద్ మిలాప్ నిర్వహించడం శుభపరిణామని అన్నారు. ముస్లింల సంక్షేమ కోసం పాటుపడుతున్న ప్రభుత్వానికి అండగా ఉండేందుకు,రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి కోరుతూ త్వరలోనే సూఫీ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.ఈ కాన్ఫరెన్స్ లో ఇరాక్, ఇరాన్, బాగ్దాద్ లాంటి అనేక ముస్లిం దేశాల నుండి సయ్యద్ హాసిమ్ గీలానీ, ఐతుల్లా అలీ ఖోమినీ లాంటి ప్రపంచ ప్రఖ్యాత ముస్లిం ప్రముఖులు, దేశవ్యాప్తంగా ఉన్న వివిధ దర్గాల పీఠాధిపతులు తో కలిసి లక్ష మందితో భారీ స్థాయిలో నిర్వహిస్తామని అన్నారు. కాన్ఫరెన్స్ అనంతరం రాష్ట్ర రాజధాని అమరావతికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావాలని కోరుతూ ప్రత్యేక దూఆ (ప్రార్థన) నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందించాలని ప్రభుత్వ పెద్దలకు విజ్ఞప్తి చేశారు అల్తాఫ్ బాబా.

ఈద్ మీలాప్ కార్యక్రమంలో మైనార్టీ శాఖ మంత్రి ఎన్ ఎండి ఫారూఖ్, ప్రభుత్వ సలహాదారులు షరీఫ్, శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు, బోండా ఉమా, యార్లగడ్డ, టిడిపి నాయకులు కొనగళ్ళ నారాయణ, జలీల్ ఖాన్, నాగుల్ మీరా, నెట్టెం రఘురాం, కాల్వ శ్రీనివాసరావు, పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *