Breaking News

“త్యాగం, ప్రేమ, క్షమ కలిగి ఉండాలి ఇదే గుడ్ ఫ్రైడే సందేశం.”

-టీడీపీ నాయకులు గద్దె క్రాంతి కుమార్

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :

గుడ్ ఫ్రైడే అనేది మానవాళి కోసం యేసు క్రీస్తు చేసిన త్యాగాన్ని స్మరించుకునే పవిత్రమైన రోజు అని, ప్రపంచానికి ప్రేమ, క్షమ, త్యాగం అనే గొప్ప విలువలను యేసు క్రీస్తు తన జీవితం ద్వారా నేర్పించారని పేర్కొన్నారు. శుక్రవారం మధ్యాహ్నం 5వ డివిజన్ క్రీస్తురాజపురంలోని IPC చర్చిలో ఫాస్టర్ సొంగ అబ్రహం నెత్రుత్వంలో జరిగిన గుడ్ ఫ్రైడే ప్రార్థన కార్యక్రమంలో టిడిపి నాయకులు గద్దె క్రాంతి కుమార్ పాల్గొని, క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేశారు. దైవజనులు పాస్టర్ అబ్రహం గద్దె క్రాంతి కుమార్ కు దీవెనలు అందజేస్తూ ఏసు క్రీస్తును ప్రార్థించారు. 

ఈ సందర్బంగా గద్దె క్రాంతికుమార్ మాట్లాడుతూ శత్రువులను కూడా క్షమించాలి అనే సందేశం నేటి సమాజానికి ఎంతో అవసరమని తెలిపారు. గుడ్ ఫ్రైడే మనలోని చెడు భావాలను విడిచిపెట్టి మంచి మార్గంలో నడవాలని సూచించే రోజు అని చెప్పారు. బాధలు, కష్టాలు వచ్చినప్పుడు కూడా ధైర్యంగా ముందుకు సాగాలని యేసు జీవితం మనకు మార్గదర్శకమని అన్నారు. సమాజంలో ప్రేమ, శాంతి, ఐక్యత పెంపొందించుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి కుటుంబంలో ఆనందం, శాంతి నెలకొనాలని ఆకాంక్షించారు. క్రైస్తవ సోదరులకు ఎల్లవేళల తమ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని, పాస్టర్లకు గౌరవ వేతనం అందిస్తున్నామని, జెరూసలెం వెళ్లాలనుకునే వారికి ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలియజేశారు. కొత్త చర్చల నిర్మాణానికి కూడా ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు.
చర్చి ఫాస్టర్ సొంగా అబ్రహం మాట్లాడుతూ తమ చర్చిలో 3 పేస్ కరెంట్ కోసం ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో సమస్యను గద్దె క్రాంతి కుమార్ ని కలిసి చెప్పగా వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి నిముషాల మీద సమస్యను పరిష్కరించారన్నారు. ఎమ్మెల్యే గద్దె రామమోహన్ నిత్యం ప్రజా సేవలో ఉంటూ ప్రజల మన్నలను పొందుతున్నారని తండ్రి లాగానే గద్దె క్రాంతి కుమార్ కూడా సేవా భావంతో ప్రజాసేవలో ఉంటున్నారన్నారు. వారికి ఏసు క్రీస్తు దీవెనలతో మరింత మందికి సాయం చేసే శక్తిని, రాజకీయ అనుగ్రహాన్ని అందించాలని ప్రార్ధించారు.

స్వయం ఉపాధి నిమిత్తం తోపుడు బండి పంపిణి

5వ డివిజన్ జయప్రకాష్ నగర్ కు చెందిన పైడిశెట్టి రాములమ్మకు స్వయం ఉపాధి చేసుకునే నిమిత్తం రూ. 15,000 విలువచేసే తోపుడు బండిని గద్దె క్రాంత్ కుమార్ సొంత నిధుల నుంచి అందజేశారు. 

ఈ కార్యక్రమాలలో బచ్చలకూర అజయ్, నందిపాటి దేవానంద్, షేక్ షరీఫ్, సొంగా ఇజ్రాయెల్, సొంగాలావణ్య, మాచర్ల ఆనంద్, షేక్ క్రాంతి కుమార్, గూడపాటి కెనడి, కందిపిల్లి ఆనంద్, ఇమ్మనపూడి బ్రహ్మేశ్వర రావు, బోరుగడ్డ వరప్రసాద్, కటివరపు కిషోర్, జిల్లేపల్లి అనిల్, షేక్ హనీఫ్, బొట్టు వంశీ తదితరులు ఉన్నారు.
అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *