ప్రత్యేక శ్రద్ధ వహిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : 

జిల్లాలో 9వ తరగతి నుండి 10వ తరగతిలో ప్రవేశించిన విద్యార్థుల పట్ల ఇప్పటినుండే ప్రత్యేక శ్రద్ధ వహిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ విద్యాధికారులకు సూచించారు.

శుక్రవారం జిల్లా కలెక్టర్ తన క్యాంపు కార్యాలయం నుండి జిల్లా విద్యాశాఖ అధికారి, మండల విద్యాధికారులు, మండల ప్రత్యేక అధికారులు, ఉన్నత పాఠశాలల ప్రత్యేక అధికారులతో విద్యార్థులకు చదువు నేర్పే విషయమై టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తాను ఇదివరకు 9 వ తరగతి నుండి పదవ తరగతికి చేరుకుంటున్న విద్యార్థులకు ప్రత్యేకించి ప్రేరణాత్మక సందేశాన్ని ఇచ్చామన్నారు.

ఆ ప్రకారంగా పాఠశాలల ప్రత్యేక అధికారులు ప్రధానోపాధ్యాయులతో కలిసి ఈనెల నాలుగో తేదీన గ్రామాల్లో పర్యటించి 10 లేదా 20 ఇళ్లు తిరిగి అక్కడ 9వ తరగతి నుండి 10వ తరగతిలో ప్రవేశించిన విద్యార్థులు ఉదయాన్నే 5 గంటలకు లేచి చదువుకుంటున్నారా లేదా విచారించాలని అవసరమైతే వారి తల్లిదండ్రులతో కూడా మాట్లాడి చదువుకునేలా పర్యవేక్షించాలని సూచించారు.
ప్రతిరోజు ఆ విద్యార్థి ఉదయమే పాఠశాలలో జరిగే పాఠాన్ని ముందుగానే చదువుకొని పాఠశాలకు వెళ్లాలని ఆ తర్వాత ఇంటికి వచ్చాక అదే పాఠాన్ని మరల ఒకసారి చదువుకుంటే బాగా అర్థమవుతుందన్నారు. ఆ విధంగా విద్యార్థులు చదువుకుంటున్నారా లేదా విచారించాలన్నారు.

ఇలా ఒక నెల రోజుల పాటు విద్యార్థులు ఉదయమే లేచే అలవాటు చేసుకుంటే ఆ తర్వాత వారు అలానే చదువు కొనసాగిస్తూ ఫలితాలు బాగా వస్తాయన్నారు.
ఆ విద్యార్థుల తల్లిదండ్రులకు కలెక్టరేట్ నుండి సందేశాలు పంపించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు

ఇప్పటికే 10వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థుల నుండి వారి పాఠ్యపుస్తకాలను తీసుకొని ప్రస్తుతం పదవ తరగతికి వచ్చిన విద్యార్థులకు అందజేసి వారు చదువుకునేలా చూడాలన్నారు.

ప్రతి ఉపాధ్యాయుని దగ్గర వారి తరగతిలో చదువులో వెనుకబడిన విద్యార్థుల జాబితా ఉంటుందని, ఆ విద్యార్థులు వారి తల్లిదండ్రులను ఇప్పటి నుండే సంప్రదించి చదువుకునేలా ప్రేరేపించాలన్నారు. అలా చేస్తే ఆ విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణులు చెందే అవకాశం ఉందన్నారు.

అలాగే ప్రాథమిక పాఠశాల విద్యార్థులలో చదువులో వెనుకబడిన విద్యార్థులకు కనీస అభ్యాసం చెప్పేందుకు గ్రామాల్లో కొందరు వాలంటీర్లు ముందుకు వచ్చారని, వారిని మండల ప్రత్యేక అధికారులు సంప్రదించి అభినందించాలని, అటువంటి మూడవ గ్రేడ్ లో ఉన్న ఆ విద్యార్థులను మొదటి గ్రేడులోకి తీసుకుని వచ్చే విధంగా కృషి చేయాలని వాలంటీర్లను కోరాలన్నారు.

ఈ టెలికాన్ఫరెన్స్లో జిల్లా విద్యాధికారి సుబ్బారావు, ఎంఈఓ లు, మండల ప్రత్యేక అధికారులు ఉన్నత పాఠశాల ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పవన్ కళ్యాణ్ చొరవ… శివయ్యకు నూతన ఆలయం…

-రూ. 55 లక్షల టీటీడీ నిధులతో వర్తనపల్లి శివాలయం పునర్నిర్మాణం -పాడేరు పర్యటనలో శివాలయాన్ని సందర్శించిన ఉప ముఖ్యమంత్రి -శిథిలావస్థకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *