Breaking News

ఇంద్రకీలాద్రిపై కేరళ డీజీపీ రవాడ ఆజాద్ చంద్రశేఖర్ ప్రత్యేక పూజలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేరళ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రవాడ ఆజాద్ చంద్రశేఖర్, ఐపీఎస్ శనివారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని సందర్శించుకున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు మరియు అర్చకులు ఘన స్వాగతం పలికారు.
అమ్మవారి అంతరాలయంలో డీజీపీ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం వేద పండితులు వారికి ఆశీర్వచనం అందజేయగా, ఆలయ అధికారులు అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదం మరియు చిత్రపటాన్ని బహుకరించారు.
ఈ సందర్భంగా కేరళ డీజీపీ మాట్లాడుతూ.. ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, భక్తుల కోసం ఆలయ యంత్రాంగం చేసిన ఏర్పాట్లు బాగున్నాయని కొనియాడారు. లోకకళ్యాణం కోసం, అందరూ క్షేమంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు ఆయన పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *