Breaking News

ఏప్రిల్ 13న యథావిధిగా పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్

-జిల్లా స్థాయిలో రెవెన్యూ క్లినిక్ కు తహశీల్దార్ల హాజరు
-కలెక్టర్ కీర్తి చేకూరి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు సోమవారం (ఏప్రిల్ 13) యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. జిల్లా కలెక్టరేట్‌తో పాటు డివిజన్, మండల, మున్సిపాలిటీ స్థాయిల్లో అర్జీలు స్వీకరించి, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. జిల్లా స్థాయి రెవెన్యూ క్లినిక్‌లో తహశీల్దార్లు, ఆర్డీవోలు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు హాజరవుతారు.
ఆన్‌లైన్ / టోల్ ఫ్రీ: meekosam.ap.gov.in ద్వారా ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చు. వివరాలకు 1100 టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులో ఉందన్నారు. మండల, మున్సిపాలిటీ స్థాయిలో కూడా గ్రీవెన్స్ డే, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు నిర్వహిస్తూ తద్వారా ప్రజలకు నేరుగా సేవలు చేరవేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. వాట్సాప్ గవర్నెన్స్: ప్రజలు తమ ఫిర్యాదులను 9552300009 నంబర్‌కు వాట్సాప్ ద్వారా పంపించవచ్చు. అందిన ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకుంటారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *