Breaking News

రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది… : మంత్రి కొలుసు పార్ధ సారధి

బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని బాపట్ల జిల్లా ఇంచార్జి మంత్రి, గృహ నిర్మాణ సంస్థ మరియు సమాచార శాఖా మంత్రి కొలుసు పార్ధ సారధి అన్నారు.

ఆదివారం, చీరాల మండలం, అక్కయిపాలెం గ్రామపంచాయతీ, రామాపురం, పాండురంగా బీచ్ నందు జిల్లా కలెక్టర్, చీరాల ఎమ్మెల్యే, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఉమామహేశ్వరరావు,బాపట్ల పార్లమెంట్ పార్టీ ప్రెసిడెంట్ శలగల రాజశేఖర్ తో కలసి బాపట్ల జిల్లా ఇంచార్జి మంత్రి, గృహ నిర్మాణ సంస్థ మరియు సమాచార శాఖా మంత్రి కొలుసు పార్ధ సారధి డైవ్ చీరాల భాగంగా ఏర్పాటు చేసిన జెట్ స్కీ రైడర్స్,విహంగ్ అడ్వెంచర్స్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జి మంత్రి వర్యులు మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలను అభివృద్ధి చేసే అధికారులకు స్థానికులు సహాఖరించాలని, అధికారులు స్థానికుల ఆచారాలకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. టూరిజంలో లక్షల పెట్టుబడి, ఉపాధి అవకాశం ఉందన్నారు. టూరిజం అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. టూరిజం అభివృద్ధికి అన్నీ పరిమితులను వెంటనే ఆమోదిస్తున్నట్లు ఆయన తెలిపారు. గతంలో వ్యాపారం చేసే సౌలభ్యం ఉండేదని, ఇప్పుడు వ్యాపారం వేగవంతం చేసే పరిస్థితులు ఉన్నాయని ఆయన తెలిపారు. కొన్ని దేశాలు కేవలం టూరిజం పై వచ్చే ఆదాయంతో మునుగుడా జరుగుతుందని ఆయన చెప్పారు. అదేవిధంగా టూరిజంను అభివృద్ధి పరచాలన్నారు. సముద్ర తీర ప్రాంతంలో అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయని ప్రపంచమంతా తెలుసునని ఆయన చెప్పారు. అటువంటి వాటికి తావు లేకుండా స్థానికులు చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు. రక్షణ విషయంలో టూరిస్టులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. స్థానికులు టూరిస్టులను మోసగించకుండా, వారికి అనుకూలంగా, స్నేహపూర్వకంగా వారితో మెలిగినప్పుడు టూరిస్టులు ఎక్కువమంది వచ్చేందుకు అవకాశం ఉంటుందని, తద్వారా ఈ ప్రాంతంలో రిసార్ట్లు ఎక్కువ అవటం, వ్యాపారం పెరగటం, ఆదాయం పెరగటం, ఉపాధి అవకాశాలు పెరగటం జరుగుతుందన్నారు. స్థానికులు రక్షణ విషయంలో నిర్వాహకులు జాతీయ నిబంధనలను జాగ్రత్తగా పాటించాలని ఆయన అన్నారు. టూరిస్టులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, స్థానికులకు ఉపాధి కల్పించాలని జిల్లా ఇన్చార్జి మంత్రి స్థానిక శాసనసభ్యులకు తెలిపారు.

ఈ సందర్భంగా బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ మాట్లాడుతూ, ఈరోజును ఒక ఇతి హాసక దినోత్సవంగా అభివర్ణించారు. ఈ సందర్భంగా ఆయన ఏపీటీడీసీ వారికి కృతజ్ఞతలు తెలిపారు. సముద్ర తీర ప్రాంతంలో 800 కిలోమీటర్ల వరకు అన్ని అడ్వెంచర్స్ కు అవకాశాలు కల్పిస్తున్నట్లు ఆయన చెప్పారు. జిల్లాస్థాయిలో అడ్వెంచర్ కమిటీ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కమిటీలో జిల్లా కలెక్టర్, సూపర్డెంట్ ఆఫ్ పోలీస్, మత్స్యశాఖ, అటవీ శాఖ, అగ్నిమాపక శాఖ, మెరైన్ పోలీస్ వారు ఈ కమిటీలో ఉంటారని ఆయన చెప్పారు. ఈ కమిటీ ద్వారా కింది స్థాయిలో ఎటువంటి దుర్ఘటన జరగకుండా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. టూరిజంను అభివృద్ధి పరుచుటలో మత్స్యకారులకు ఎటువంటి ఆటంకం కలగకుండా, అటవీ ప్రాంతమునకు కాపాడుకుంటూ కోస్టల్ రెగ్యులర్టి జోన్ గా పాటించాలని నిర్ణయం చేసినట్లు ఆయన చెప్పారు. ఈ అభివృద్ధి ద్వారా అందరికీ మేలు జరగాలని ప్రభుత్వం కోరుకుంటుందని ఆయన చెప్పారు. బాపట్ల సూర్యలంక బీచ్ మొదలుకొని అన్ని బీచ్లను సర్వాంగ సుందరంగా గోవా రూపంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. దీనికి అధికారులందరూ కృషి చేస్తున్నారని ఆయన చెప్పారు. స్థానికులు ఎటువంటి ఇబ్బందులు కలగజేయకుండా సహకరించాలని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా చీరాల శాసనసభ్యులు ఎం ఎం మాలకొండయ్య మాట్లాడుతూ, చీరాల తీర ప్రాంతం అభివృద్ధికి కృషి చేస్తున్న జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులకు, జిల్లా కలెక్టర్ వారికి, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారికి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. చీరాల పట్టణం దినదినాభివృద్ధి చెందుతుందని, అది కూడా వారి హయాంలో జరుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉందని ఆయన అన్నారు. డైవ్ చీరాలలో భాగంగా ఏర్పాటు చేసిన జెట్ స్కై అనుభూతి అంతా ఇంత కాదని, అదేవిధంగా విహంగ వీక్షణం ద్వారా సముద్రంపై ప్రయాణం ఎంతో ఆనందంగా ఉంటుందని, వారి ప్రయాణం కు యూట్యూబ్లో మూడు లక్షల వీవర్స్ వచ్చినట్లు దానికి ఎంతో ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. ఈ ప్రాంతంకు ఇతర ప్రాంతాల నుండి టూరిస్టులు అధికంగా వస్తున్నారని, ఇక్కడ రిసార్ట్ సౌకర్యం బాగా ఉందని, ఇక్కడ చీరాల మెడికల్ కాలేజ్ పూర్తి అయితే ఇంకా బాగుంటుందని ఆయన అన్నారు. అధికారులు ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని, చీరాల అభివృద్ధికి పెట్టుబడులు వస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని ఆయన చెప్పారు.

ఈ సందర్భంగా జెట్ స్కై కి అధినేత రాజ్ కుమార్ మరియు విహంగ అడ్వెంచర్స్ అధినేత సూర్య లకు ఎం. ఓ. యు పత్రాలను జిల్లా ఇన్చార్జి మంత్రి కొలుసు పార్థసారథి చేతుల మీదుగా అందజేశారు.

ఈ కార్యక్రమంలో వారితోపాటు అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *