అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో సోమవారం ఎండతీవ్రత, మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలతో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఆదివారం గరిష్ఠంగా కర్నూలు జిల్లా నగరడోనలో 45.4డిగ్రీలు నమోదైందని తెలిపారు. 279 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్లు ఎపిఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు.
సోమవారం(20-04-26) పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, రాయలసీమ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైందుకు అవకాశం ఉందన్నారు.
రేపు తీవ్ర వడగాల్పులు వీచే మండలాలు(32)
శ్రీకాకుళం జిల్లా : బూర్జ, హిరమండలం, పాతపట్నం మండలాలు
విజయనగరం జిల్లా: బాడంగి, బొబ్బిలి, బొండపల్లి, దత్తిరాజేరు, గజపతినగరం, మెంటాడ, మెరకముడిదాం, రాజాం, రామభద్రాపురం, సంతకవిటి, తెర్లాం, వంగర మండలాలు ;
పార్వతీపురంమన్యం జిల్లా: బలిజిపేట, గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కొమరాడ, కురుపాం, మక్కువ, పాచిపెంట, పాలకొండ, పార్వతీపురం, సాలూరు,సీతంపేట, సీతానగరం, వీరఘట్టం మండలాల్లో(32) తీవ్ర వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొన్నారు.
శ్రీకాకుళం1, విజయనగరం 7, మన్యం 1, పోలవరం 4, అనకాపల్లి 1,
తూర్పుగోదావరి 2, ఏలూరు 1 మండలాల్లో(17) వడగాల్పులు వీచేందుకు అవకాశం ఉందన్నారు.
ఆదివారం కర్నూలు(జి )నగరడోనలో 45.4°C, కడప(జి) ఖాజీపేటలో 44.5°C, కాకినాడ(జి) కరపలో 44.4°C, అనంతపురం(జి) రాయదుర్గం, నంద్యాల(జి) ఆళ్లగడ్డలో 44.3°C, తిరుపతి(జి)వరదయ్యపాలెం 43.8°C, మార్కాపురం(జి) అనుమలపల్లిలో 43.6°C, నెల్లూరు(జి) కొమ్మిపాడులో 43.2°C, శ్రీసత్యసాయి(జి) దాడితోటలో 43.1°C, అన్నమయ్య(జి) గాలివీడులో 42.7°C, ఒంగోలులో 42.2°C,
పల్నాడు(జి) గురజాలలో 42.1డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.
ఎండలో బయటకు వెళ్లేటప్పుడు చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలని, గుండె సంబంధిత వ్యాదులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగరాదని సూచించారు. నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు,మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు.
ద్రోణి ప్రభావంతో సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు పొలాల్లో పని చేసే రైతులు,పశు కాపరులు చెట్ల కింద నిలబడరాదని హెచ్చరించారు.
Prajavartha Online Telugu News