విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముంబైలోని రాంభావ్ మహాల్గి ప్రభోధిని, భయందర్ వేదికగా 22 ఏప్రిల్ 2026న నిర్వహించిన జాతీయ స్థాయి వర్డ్ పవర్ చాంపియన్‌షిప్ (WPC) పోటీలలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు విశిష్ట ప్రతిభ కనబర్చారు. ఈ పోటీలను LeapForWord సంస్థ ఆధ్వర్యంలో 2వ తరగతి నుండి 5వ తరగతి విద్యార్థుల కోసం నిర్వహించారు. దేశంలోని 9 రాష్ట్రాల నుండి విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విద్యార్థుల ప్రదర్శన వివరాలు ఈ విధంగా ఉన్నాయి:
4వ తరగతి: గెడ్డం జతిన్ మణికాంత (MPPS వక్కపట్లవారిపాలెం, నాగాయలంక మండలం, కృష్ణా జిల్లా) – 1వ స్థానం
2వ తరగతి: బి. సైలేష్ గౌడ్ (MPPS వెలిగల్లు, పెద్దమండ్యం మండలం, అన్నమయ్య జిల్లా) – 2వ స్థానం
5వ తరగతి: బి. రేవంత్ కుమార్ (MPPS కనిమెర్ల, మైలవరం మండలం, ఎన్టీఆర్ జిల్లా) – 3వ స్థానం
3వ తరగతి: డి. జోస్యశ్రీ (MPPS వక్కపట్లవారిపాలెం, నాగాయలంక మండలం, కృష్ణా జిల్లా) – 4వ స్థానం
ఈ విజయాలతో రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచిన విద్యార్థులను AP SCERT అభినందిస్తుంది.
ఈ విజయాలు విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం మరియు సంస్థల సమన్వయంతో సాధ్యమయ్యాయి. భవిష్యత్తులో కూడా ఇలాంటి జాతీయ స్థాయి వేదికలపై ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు మరింత ప్రతిభ కనబరుస్తారని ఆశిస్తున్నాము.
ఈ కార్యక్రమానికి AP SCERT నుండి డా. డి. రోసెలాండ్, చంద్రశేఖర్ హాజరయ్యారు. విభా సంస్థ నుండి అసోసియేట్ డైరెక్టర్ టి. వీరనారాయణ, LeapForWord సంస్థ నుండి స్టేట్ మేనేజర్ విజయ్ మరియు వారి బృందం పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News