Breaking News

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా పరిశోధన మరియు శిక్షణ మండలి (AP SCERT)

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముంబైలోని రాంభావ్ మహాల్గి ప్రభోధిని, భయందర్ వేదికగా 22 ఏప్రిల్ 2026న నిర్వహించిన జాతీయ స్థాయి వర్డ్ పవర్ చాంపియన్‌షిప్ (WPC) పోటీలలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు విశిష్ట ప్రతిభ కనబర్చారు. ఈ పోటీలను LeapForWord సంస్థ ఆధ్వర్యంలో 2వ తరగతి నుండి 5వ తరగతి విద్యార్థుల కోసం నిర్వహించారు. దేశంలోని 9 రాష్ట్రాల నుండి విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విద్యార్థుల ప్రదర్శన వివరాలు ఈ విధంగా ఉన్నాయి:

4వ తరగతి: గెడ్డం జతిన్ మణికాంత (MPPS వక్కపట్లవారిపాలెం, నాగాయలంక మండలం, కృష్ణా జిల్లా) – 1వ స్థానం

2వ తరగతి: బి. సైలేష్ గౌడ్ (MPPS వెలిగల్లు, పెద్దమండ్యం మండలం, అన్నమయ్య జిల్లా) – 2వ స్థానం

5వ తరగతి: బి. రేవంత్ కుమార్ (MPPS కనిమెర్ల, మైలవరం మండలం, ఎన్టీఆర్ జిల్లా) – 3వ స్థానం

3వ తరగతి: డి. జోస్యశ్రీ (MPPS వక్కపట్లవారిపాలెం, నాగాయలంక మండలం, కృష్ణా జిల్లా) – 4వ స్థానం

ఈ విజయాలతో రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచిన విద్యార్థులను AP SCERT అభినందిస్తుంది.

ఈ విజయాలు విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం మరియు సంస్థల సమన్వయంతో సాధ్యమయ్యాయి. భవిష్యత్తులో కూడా ఇలాంటి జాతీయ స్థాయి వేదికలపై ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు మరింత ప్రతిభ కనబరుస్తారని ఆశిస్తున్నాము.

ఈ కార్యక్రమానికి AP SCERT నుండి డా. డి. రోసెలాండ్, చంద్రశేఖర్ హాజరయ్యారు. విభా సంస్థ నుండి అసోసియేట్ డైరెక్టర్ టి. వీరనారాయణ, LeapForWord సంస్థ నుండి స్టేట్ మేనేజర్ విజయ్ మరియు వారి బృందం పాల్గొన్నారు.

 

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *