విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ 48 వ డివిజన్ కు చెందిన యంగల భువనేశ్వరి కి. అన్ని అవయవాలు పని చేయక పోవడంతో వెంటిలేటర్ తో చికిత్స చేయాల్సి వచ్చింది . ఆమెకు వైద్యం కోసం 4,00,000/- రూపాయలు అవుతుందని వైద్యులు తెలిపారు. అదే విధంగా 56 వ డివిజన్ కు చెందిన మొగల్ అజీజ్ బేగ్. హెర్నియా సమస్యతో బాధ పడుతున్నాడు. ఆయనకు వైద్యాంకోసం 2,03,000/- రూపాయలు అంటుందని వైద్యులు తెలిపారు. వీరిరువురూ ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయాన్ని సంప్రదించారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి వీరిద్దరికీ వైద్యం కోసం ఆర్థిక సాయం కోరుతూ సీఎం రిలీఫ్ ఫండ్ కు లేఖ రాసారు.. వీటికి సంబంధించిన ఎల్వోసీ పత్రాలను బుధవారం సుజనా చౌదరి కార్యాలయంలో బాధితుల కుటుంబ సభ్యులకు అంద చేశారు.. కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, 48 డివిజన్ టిడిపి ప్రెసిడెంట్ బెవర. జోగేశ్వరరావు, : 56 డివిజన్ టిడిపి ప్రెసిడెంట్ పెద్దిన శ్యాంసుందర్, 49 డివిజన్ మాజీ కార్పొరేటర్ బుల్ల విజయ్ కుమార్ , సుజనా మిత్ర లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News