అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఎపి సచివాలయంలో బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ అధ్యక్షతన 2026 ఏడాదికి మొదటి త్రైమాసిక నకార్డ్ సమావేశం ప్రారంభమైంది.ఈసమావేశంలో సిఎస్ మాట్లాడుతూ గంజాయి ఇతర మత్తు పదార్ధాల సేవనం పూర్తి స్థాయిలో నివారించాల్సిన అవసరం ఉందని ఆదిశగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఈగల్ చీఫ్ రవి కృష్ణను ఆదేశించారు.గంజాయి సాగు,రవాణా నియంత్రణపై ఒడిస్సా సిఎస్ కు డిఓ లేఖ వ్రాయనున్నట్టు పేర్కొన్నారు. ఈసమావేశంలో ఈగల్ చీఫ్ రవికృష్ణ ఈగల్ ఆపరేషన్లకు సంబంధించిన ప్రగతిని వివరిస్తూ ఈఏడాది ఇప్పటి వరకు 10వేల 573 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని 432 కేసులు రిజిష్టర్ చేసి 1127 మందిని అరెస్టు చేసి 197 వాహనాలను స్వాధీన పరుచుకున్నట్టు వివరించారు.అలాగే ఇతర డ్రగ్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.ఇంకా ఇతర ప్రగతి వివరాలను వివరించారు. ఈసమావేశంలో ఈగల్ చీఫ్ ఐజి రవికృష్ణ, వర్చువల్ గా డిజిపి హరీశ్ కుమార్ గుప్త,వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి సౌరబ్ గౌర్,తదితర అధికారులు పాల్గొన్నారు.
Tags amaravathi
Check Also
ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ
-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …
Prajavartha Online Telugu News