Breaking News

“సింగపూర్ వర్సిటీ” పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ టియోతో మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ భేటీ!

-రాష్ట్రoలో ఆరోగ్య రంగం పటిష్టత పై వారివురి మధ్య చర్చ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ లోని ఆరోగ్య వ్యవస్థను ప్రపంచ స్థాయి ప్రమాణాలకు ధీటుగా తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. సింగపూర్ పర్యటనలో భాగంగా మంత్రి “నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్” పబ్లిక్ హెల్త్ డిపార్టుమెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వై.వై.టియోతో మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థ పటిష్టం చేసేందుకు సీఎం శ్రీ చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి వై వై టియోకు మంత్రి వివరించారు. ముఖ్యంగా వైద్య సేవలను మెరుగుపరిచేందుకు గేట్స్ ఫౌండేషన్తో కుదుర్చుకున్న ఒప్పందం, ఇందుకు తగ్గట్లు తీసుకుంటున్న చర్యల గురించి టియోకు మంత్రి తెలిపారు. పేద రోగులకు అందించే వైద్య సేవల్లో క్రత్రిమ మేదస్సు (ఏఐ)ను వినియోగిస్తున్నామని, ఎన్సీడీ-04 ద్వారా ఓరల్, బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్ వ్యాధులను ముందుగానే గుర్తించేందుకు స్క్రీనింగ్ చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. రోగుల ఆరోగ్య వివరాలతో ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ సిద్ధం చేస్తున్నామని చెప్పారు.
‘స్టెమీ’ ప్రోగ్రాం ద్వారా గోల్డెన్ అవర్లో గుండెపోటు బారినపడిన వారికి ఖరీదైన ఇంజక్షన్ను ఉచితం గా అందిస్తున్న విషయాన్ని టియో దృష్టికి మంత్రి తీసుకువెళ్లారు. వైద్య సేవల్లో ఉత్తమ విధానాలు (బెస్ట్ ప్రాక్టీస్) అవలంబించేందుకు సిద్ధంగా ఉన్నామని, తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలని మంత్రి టియోను కోరారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య రంగంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపట్ల టియో సంతృప్తి వ్యక్తంచేశారు.
ఈ మేరకు వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ నేడొక ప్రకటన జారీచేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య రంగం పటిష్టతకు అత్యున్నత స్థాయిలో ఏర్పాటుచేసిన సలహా బృందంలో టియో సభ్యులుగా ఉన్నారు. వీరివురి సమావేశం భవిష్యత్తులో రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థ బలోపేతానికి దోహదం చేస్తుంది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *