అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచ మలేరియా దినోత్సవం(శనివారం) సందర్భంగా ప్రచార, అవగాహన వాల్‌పోస్టర్లు, కరపత్రాల్ని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జి.వీరపాండియన్ శుక్రవారంనాడు మంగళగిరిలోని ఏపిఐఐసి టవర్స్ లోని తన ఛాంబర్‌లో ఆవిష్కరించారు. జాతీయ కీటక జనిత వ్యాధి నియంత్రణ కార్యక్రమం కింద రాష్ట్రంలో మలేరియా నిర్మూలనకు సంబంధించి తీసుకున్న చర్యల గురించి ఆయన వివరించారు. మలేరియాపై ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని సంబంధిత అధికారుల్ని ఆయన ఆదేశించారు. డ్రివెన్ టు ఎండ్ మలేరియా-నౌ వియ్ కెన్, నౌ వియ్ మస్ట్ అనే నినాదంతో ముందుకెళ్లాలన్నారు. డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రాం అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News