Breaking News

ఎగ్జిబిషన్ ఆవరణలో ఎండు గడ్డిని వెంటనే తొలగించాలి…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఎగ్జిబిషన్ ఆవరణలో ఎండు గడ్డిని వెంటనే తొలగించాలని విజయవాడ నగరపాలక సంస్థ రీజినల్ ఫైర్ ఆఫీసర్ డి. మాల్యాద్రి అన్నారు. ప్రస్తుత వేసవి తీవ్రత, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం వల్ల కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు ఫైర్ ప్రివెన్షన్ టీమ్ శుక్రవారం ఉదయం బాబూరి గ్రౌండ్స్‌, భవానిపురం లో జరుగుతున్న ఎగ్జిబిషన్ ప్రాంగణాన్ని సిబ్బందితో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బబ్బురి గ్రౌండ్స్ చుట్టుపక్కల 6 మీటర్ల వరకున్న ఎండు గడ్డను వెంటనే తొలగించాలని, స్టాళ్లలో ఎవ్వరూ లోపల వంట చేయకూడదని, ఎగ్జిబిషన్ ప్రాంగణం నాలుగు వైపులా ఎమర్జెన్సీ గేట్లు పెట్టాలని, అంబులెన్స్, ఫైర్ వాహనాలు సులభంగా రావడానికి. ప్రతి 10 స్టాళ్లకు ఒక గ్యాప్ ఉంచాలని, రద్దీ తగ్గి ఎమర్జెన్సీలో సులభంగా వెళ్లడానికి, ఎమర్జెన్సీ ఎగ్జిట్ దారులు చూపించే బోర్డులు, మ్యాప్స్ స్పష్టంగా పెట్టాలని, ప్రతి స్టాల్ దగ్గర ఫైర్ ఎక్స్‌టింగ్విషర్, 200 లీటర్ల నీటి డ్రమ్ తప్పనిసరిగా ఉండాలని, ఎగ్జిబిషన్ ప్రారంభానికి ముందు ఫైర్ సేఫ్టీ మాక్ డ్రిల్ చేయాలని, స్టాళ్లకు కప్పే డెకరేషన్ గుడ్డలు వాడకూడదని, అవి ప్రమాదకరం అని తెలిపారు.

ఎగ్జిబిషన్లో జనసాంద్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి, వేసవికాలం నేపథ్యంలో ప్రజలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున అగ్ని ప్రమాదం జరగకుండా ఖచ్చితమైన నివారణ చర్యలు తీసుకోవాలని ఎగ్జిబిషన్ నిర్వాహకులకు తెలిపారు. విస్తీనానికి తగ్గట్టుగా, అందులో ఉన్న షాపులకి తగ్గట్టుగా అగ్ని ప్రమాద నివారణ చర్యలు ఉండాలని, ఉండాల్సిన వాటిలో ఏది లేకపోయినా వారికి అనుమతి లభించదని, అనుమతి పొందిన తర్వాత కూడా వాటిని వారు సక్రమంగా నిర్వహించాలని, ఆకస్మిక తనఖిలో వారు ఏమైనా లోపం పరిశీలిస్తే వెంటనే వారి అనుమతి రద్దు చేస్తారని తెలిపారు. ఈ పర్యటనలో స్టేషన్ ఫైర్ ఆఫీసర్ నరేష్, ఫైర్ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *