Breaking News

విజయవాడ తో పాటు స్వచ్ఛ షహర్ జోడీలు కూడా స్వచ్ఛ సర్వేక్షన్ లో ముందంజలో ఉండాలి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మంగళవారం ఉదయం ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ లో స్వచ్ఛ షెహార్ జోడీల కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

స్వచ్ఛ సర్వేక్షన్ 2024 -25 లో ఉత్తమ ర్యాంకులున్న నగరాలకు తక్కువ ర్యాంక్ ఉన్న నగరాలను జతపరుస్తూ స్వచ్ఛ జోడిలుగా కేంద్ర ప్రభుత్వం వారిని ప్రకటించింది. అందులో భాగంగా విజయవాడకు చింతలపూడి, సామర్లకోట, ఆకివీడు, నర్సాపూర్, గొల్లప్రోలు, నగరాలను విజయవాడకు జతపరిచి, విజయవాడతో పాటు ఆ మున్సిపాలిటీలు మరియు గ్రామ పంచాయతీలు కూడా అభివృద్ధి చెందేటట్టు చర్యలు తీసుకోవాలని, విజయవాడ వారికి సహకరిస్తూ స్వచ్ఛ సర్వేక్షన్ లో ముందుంజలో ఉన్నందుకు విజయవాడ కు ఉన్న ప్రణాళికను వారికి కూడా తెలియపరుస్తూ, వారిని కూడా స్వచ్ఛ సర్వేక్షన్ లో ఉత్తమ స్థానం కైవసం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించగా, అందుకు అనుగుణంగా ప్రకటించిన నాటి నుండి నేటి వరకు విజయవాడ నగరపాలక సంస్థ, సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ జోడి షహర్ల అభివృద్ధిని, స్వచ్ఛ సర్వేక్షన్ లో వాటి పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తుందని కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు.

స్వచ్ఛ సర్వేక్షన్ లో ప్రధాన అంశాలైన పారిశుధ్య నిర్వహణ, మరుగుదొడ్ల నిర్వహణ, వ్యర్ధ పదార్థాల నిర్వహణ, నగర అందం, వాల్ పెయింటింగ్ వంటి అంశాలపై చర్చించారు. మెంటీ సిటీలైన స్వచ్ఛ షెహార్ జోడీలకు ఎటువంటి సహకారం కావాలన్నా విజయవాడ నగరపాలక సంస్థ కచ్చితంగా సహకరిస్తుందని అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ నుండి జోడి షహర్ లకు తమ సిబ్బందిని పంపించి వారికి సహకారాన్ని అందిస్తారని, స్వచ్ఛ సర్వేక్షన్ 2025 -26 లో ఉత్తమ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు వారికి అవసరమైన దిశ నిర్దేశం చూపిస్తున్నాం అని కమిషనర్ అన్నారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ (ప్రాజెక్ట్) డాక్టర్ డి.చంద్రశేఖర్, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె. అర్జునరావు, చీఫ్ ఇంజనీర్ (ఇంచార్జ్) పి.సత్యకుమారి, చింతలపూడి కమిషనర్ ఏ.రాంబాబు,ఆకివీడు కమిషనర్ జి. కృష్ణమోహన్, నరసాపూర్ కమిషనర్ ఆర్.వెంకటరామిరెడ్డి, గొల్లప్రోలు కమిషనర్ పి. శ్రీనివాసులు , సామర్లకోట కమిషనర్ ఏ. శ్రీవిద్య, సిబ్బంది, పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *