Breaking News

ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలకు రూ.501 కోట్లు చెల్లింపు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు అనుబంధ ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలకు కూటమి ప్రభుత్వం బకాయిల్లో ఇప్పటివరకు రూ.501 కోట్ల వరకు చెల్లించింది. పెండింగులో ఉన్న మొత్తంలో ‘ట్రై-పార్టీ బిల్ డిస్కౌంటింగ్ అగ్రిమెంట్ (టీబీడీఏ) విధానంలో రూ.1,000 కోట్లు చెల్లించాలని కూటమి ప్రభుత్వ నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఎన్టీఆర్ వైద్యా సేవా ట్రస్టు, ఆసుపత్రుల యాజమాన్యాల మధ్య కుదిరిన ఒప్పందాలు అనుసరించి గత సోమవారం నుంచి చెల్లింపులు జరుగుతున్నాయి. మొత్తం 278 ఆసుపత్రుల యాజమాన్యాలకు కలిపి రూ.501 కోట్ల వరకు చెల్లింపులు జరిగినట్లు ఎన్టీఆర్ వైద్యా సేవా ట్రస్టు ఇంఛార్జి సీఈఓ, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ చక్రధరబాబు నేడొక ప్రకటనలో తెలిపారు. బిల్ డిస్కౌంటింగ్ విధానంలో బకాయిలు పొందేందుకు 873కుగాను 531 ఆసుపత్రుల యాజమాన్యాలు దరఖాస్తు చేశాయి. వీటిలో 336 దరఖాస్తుల పరిశీలన పూర్తయింది. బకాయిలపై ఆసుపత్రుల యాజమాన్యాలకు కూటమి ప్రభుత ప్వం ఇచ్చిన హామీ మేరకు చెల్లింపులు జరుగుతున్నాయి..

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *