Breaking News

ఆర్టీసీ కార్మికుల సేవలు ప్రశంసనీయం

-కార్మికుల కృషి సేవ రంగ బలానికి ఆధారం
-ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
-కార్మికుల శ్రమకు గౌరవం ఇస్తేనే భవిష్యత్తులోనూ నిబద్ధతతో సేవలు సాగుతాయి…మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మే డే) సందర్భంగా రాష్ట్రంలోని కార్మికులకు, ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులకు మంత్రి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసి, రాయచోటిలోని క్యాంపు కార్యాలయం నుండి రాష్ట్ర రవాణా, యువజన క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పత్రికా ప్రకటన విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికుల అంకితభావంతో చేసిన సేవలను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ, ఎండలు, వర్షాలు లెక్కచేయకుండా ప్రజలకు నిరంతరం సేవలందిస్తున్న ఆర్టీసీ సిబ్బంది కృషి ప్రశంసనీయం అన్నారు. ప్రయాణికుల భద్రత, సమయపాలనలో ఆర్టీసీ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు.

కార్మికుల శ్రమ దేశ ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాది అని మంత్రి తెలిపారు. వ్యవసాయం నుంచి పరిశ్రమల వరకు ప్రతి రంగంలో కార్మికులే ప్రధాన శక్తిగా నిలుస్తున్నారని అన్నారు. కార్మికుల హక్కులు, సంక్షేమం, భద్రత కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని స్పష్టం చేశారు. రక్షణ సేదంగా మారి ఆరోగ్యాలను అభివృద్ధి చేసే కార్మిక శక్తికి వందనం తెలుపుతూ, మండుటెండ, చలి, వర్షం వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ అలుపెరగక పని చేసే కార్మికుల త్యాగాలు స్మరణీయమన్నారు. శ్రమిక వర్గం హక్కులు, సాధించిన విజయాలను స్మరించుకునే రోజు మే డే అని పేర్కొన్నారు. శ్రమ దోపిడీ వ్యతిరేక పోరాటాల ఫలితంగా కార్మిక లోకంలో చైతన్యం వెలిసిందని, కార్మికుల ఐక్యత, శ్రమ గౌరవాన్ని చాటిచెప్పే వేడుక మే డే అని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టే శక్తి కార్మిక వర్గమని స్పష్టం చేశారు. కార్మిక సంక్షేమం కోసం ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందని మంత్రి తెలిపారు. నైపుణ్య శిక్షణ కేంద్రాలు, వైద్య సేవలు, బీమా పథకాలు, ఉపాధి అవకాశాల పెంపు వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. నిర్మాణ రంగ కార్మికులకు భద్రత కల్పించేందుకు తీసుకున్న నిర్ణయాలు వారి జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తాయని తెలిపారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని, ప్రతి నెల జీతాలు, పెన్షన్లు సమయానికి చెల్లించే విధానం అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. కార్మికుల కుటుంబాలకు భద్రత కల్పించేందుకు సంక్షేమ బోర్డులు, బీమా పథకాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్మికుల క్షేమం, గౌరవం ప్రతి ఒక్కరి బాధ్యత అని మంత్రి స్పష్టం చేశారు. సమానత్వం, హక్కులు ప్రతి కార్మికుడికి అందాలని, దేశం అభివృద్ధి చెందాలంటే కార్మికుడు అభివృద్ధి చెందాల్సిందేనని అన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలోని సమస్త కార్మిక సోదర సోదరీమణులకు మంత్రి మరోసారి అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *