అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
విధుల నిర్వహణలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన నలుగురు ఉద్యోగులను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ సస్పెండ్ చేసింది. మంగళగిరిలోని ఆహార భద్రత శాఖ (ఇన్స్టిట్యూట్ అఫ్ ప్రివెంటివ్ మెడిసిన్) ప్రధాన కార్యాలయంలో పనిచేసే సూపరింటెండెంట్ డి. శిరీష, సీనియర్ అసిస్టెంట్స్ జి అఖిల్, సంగీతరావు, జె. సుజాత సస్పెండ్ కు గురైన వారిలో ఉన్నారు. అనధికారికంగా సెలవుపై వెళ్లడం, విశ్రాంత ఉద్యోగికి ఆర్ధిక ప్రయోజనాల చెల్లింపుల విష యంలో తగిన విధంగా స్పందించకపోవడం వంటి కారణాలతో సుజాతను, విధుల నిర్వహణలో ఉన్నతాధికారుల ఆదేశాలు పాటించకపోవడం, పలుమార్లు హెచ్చరించినప్పటికీ మార్పు కనిపించకపోవడం, ఇతర కారణాలతో మిగిలిన వారిని సస్పెండ్ చేశారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు ఫిర్యాదులపై విచారణ జరిపిన అనంతరం నలుగురిని సస్పెండ్ చేస్తూ ఇనిస్ట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ఇంచార్జి డైరెక్టర్, రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ ఆదేశాలు జారీచేశారు. విధుల నిర్వహణలో అలక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తప్పవని కమిషనర్ స్పష్టంచేశారు.
Tags amaravathi
Check Also
ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు
-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …
Prajavartha Online Telugu News