-ప్రభుత్వ పరీక్షల విభాగం, డైరెక్టర్ డాక్టర్ కె.వి. శ్రీనివాసులు రెడ్డి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మార్చి 2026లో జరిగిన SSC (పదవ తరగతి) పబ్లిక్ పరీక్షలకు సంబంధించి, జవాబు పత్రాల రీకౌంటింగ్ (Recounting) మరియు రీ-వెరిఫికేషన్ (Re-verification) కోసం ఆన్‌లైన్ లో దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం, డైరెక్టర్ డాక్టర్ కె.వి. శ్రీనివాసులు రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈనెల (మే) ఒకటవ తేదీ (శుక్రవారం) నుండి ఏడవ తేదీ (గురువారం) వరకు అభ్యర్థులు తమ సంబంధిత పాఠశాల లాగిన్ (School Login) ద్వారా దరఖాస్తు చేసు కోవాల్సి ఉంటుందన్నారు. ఆసక్తి గల విద్యార్థులు తమ పాఠశాల ప్రధానోపాధ్యాయులను సంప్రదించి దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుందన్నారు.
రీకౌంటింగ్ కు ఒక సబ్జెక్టుకు రూ .500/-, రీ-వెరిఫికేషన్ కు ఒక సబ్జెక్టుకు ₹రూ.1,000/- అభ్యర్థులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఫీజును కేవలం www.bse.ap.gov.in వెబ్‌సైట్‌లోని ఆన్‌లైన్ పేమెంట్ గేట్‌వే (Debit Card / Credit Card / Net Banking / UPI) ద్వారా మాత్రమే చెల్లించాలన్నారు. CFMS సిటిజన్ చలానా ద్వారా చెల్లింపులు స్వీకరించబడవన్నారు. జవాబు పత్రాల డౌన్‌లోడ్ సదుపాయం కల్పించ బడిందని గత సంవత్సరాల్లో రీ-వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల జవాబు పత్రాలు కేవలం స్కూల్ లాగిన్‌లో మాత్రమే అందుబాటులో ఉండేవన్నారు. అయితే, ఈ ఏడాది నుండి అదనంగా విద్యార్థుల సౌకర్యార్థం WhatsApp Governance (Mana Mitra service: 955230 0009) ద్వారా కూడా స్కాన్ చేసిన జవాబు పత్రాలను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించబడిందన్నారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయులందరూ ఈ సమాచారాన్ని అర్హులైన అభ్యర్థులందరికీ చేరేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించడమైనదన్నారు. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్ www.bse.ap.gov.in సందర్శించవచ్చునని
ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ డాక్టర్ కె.వి. శ్రీనివాసులు రెడ్డి ఆ ప్రకటనలో తెలిపారు.
Prajavartha Online Telugu News