Breaking News

బీసెంట్ రోడ్ లో జనసేన పార్టీ నాయకులు కొంపల్లి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో రోజురోజుకీ పెరుగుతున్న ఎండలను దృష్టిలో ఉంచుకొని జనసేన పార్టీ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటుచేసి దానిలో మజ్జిగ పంపిణీ చేయడం ఎంతో అభినందనీయమని ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను అన్నారు, సోమవారం బీసెంట్ రోడ్ లో జనసేన పార్టీ నాయకులు కొంపల్లి అరుణ్ కుమార్ (నాని) ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని రిబ్బన్ కట్ చేసి లాంచనంగా ప్రారంభించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ పిలుపు మేరకు ప్రజలకు నాయకులు, కార్యకర్తలు చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని తెలిపారు. పార్టీలో కష్టపడిన నాయకులకి, కార్యకర్తలకి, జన సైనికులకి వీర మహిళలకి ప్రాధాన్యత ఖచ్చితంగా వుంటుందని స్పష్టం చేశారు. జనసేన పార్టీ నాయకులు కొంపల్లి అరుణ్‌కుమార్ (నాని) మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను, సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుల సహాయ సహకారాలతో సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం తొలి రోజు ఓపెనింగ్ ప్రారంభం సందర్భంగా చల్లటి మజ్జిగను బాటసారులకు పంపిణీ చేశారు, ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు,

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *