సుజనా ఫౌండేషన్ మొబైల్ మెడికల్ క్యాంప్ లో వేరికోస్ వైన్స్ చికిత్సలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ నియోజకవర్గంలోని పోలీస్ క్వార్టర్స్ ప్రాంగణంలో సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొబైల్ మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఈ క్యాంపులో 37, 53 డివిజన్ల ప్రజలు విశేషంగా వైద్య సహాయం పొందారు. క్యాంప్ ద్వారా పలు సాధారణ అనారోగ్య సమస్యలతో పాటు వేరికోస్ వెయిన్స్ కు ప్రముఖ వాస్క్యూలర్ సర్జన్ ఎస్ డీ కే శశిధర్ పలు సమస్యలకు వైద్య సహాయం అందించారు. సంబంధించిన వైద్య పరీక్షలు, చికిత్స తో పాటు మందులు కూడా ఉచితంగా అంద చేశారు. ఈ క్యాంపులో వివిధ విభాగాల సీనియర్ వైద్యుల కన్సల్టేషన్ తో పాటు ఈసీజీ, ఎక్స్ రే, 2డీ ఎకో, తదితర పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. శంకర్ నేత్ర చికిత్సాలయ ఆధ్వర్యంలో కంటి పరీక్షలు నిర్వహించారు. పీవీఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పటల్ వారి మెడికల్ టీమ్ క్యాంప్ కు సహకరించారు. కార్యక్రమంలో సుజనా ఫౌండేషన్ ప్రతినిధులు కిరణ్, వెంకట రమణ, హరీష్, బీజేపీ 37 డివిజన్ ఇన్‌చార్జ్ హరీష్ వ్యాస్, బీజేపీ 37వ డివిజన్ అధ్యక్షుడు సంపత్, టీడీపీ 37వ డివిజన్ ప్రెసిడెంట్ అమర్ల గోపాల్ కృష్ణ మురళి, సుజనా మిత్ర లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సహకార శాఖలో పారదర్శకంగా ప్రమోషన్లు, పోస్టింగులు

– ఉద్యోగులకు సమయానికి పదోన్నతులు – వారి ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది – వ్యవసాయ,సహకార శాఖల మంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *