నగరంలో వరేణ్య వన్ గ్రామ్ గోల్డ్ అండ్ పెరల్స్ షోరూమ్ గొప్ప ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వరేణ్య వన్ గ్రామ్ గోల్డ్ అండ్ పెరల్స్ షోరూం ఏలూరు రోడ్,డు రాజగోపాల చారి వీధి, అప్సర థియేటర్ ఎదురుగా స్వర్ణ లోక్ కాంప్లెక్స్ లో శనివారం గొప్పగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం మాజీ మంత్రి, చీపురుపల్లి శాసనసభ్యులు అయిన కిమిడి కళా వెంకట్రావు చేతుల మీదగా నిర్వహించారు. మొదటిగా కళా వెంకట్రావు రిబ్బన్ కట్ చేసి షోరూమ్ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరొక ప్రత్యేక ఆహ్వానితులుగా సినీ తార హెబ్బా పటేల్ విచ్చేయడం జరిగింది. ఆమె విజయవాడ ప్రజలకు సెల్ఫీలు ఇస్తూ ఎంతగానో ప్రజలను ఆకట్టుకున్నారు. అనంతరం కళా వెంకట్రావు, హెబ్బా పటేల్ మీడియాతో మాట్లాడుతూ అతి తక్కువ ధరలకు నాణ్యమైన బంగారు ఆభరణాలు వన్ గ్రామ్ గోల్డ్ వంటివి వరేణ్య షో రూమ్ లో లభిస్తున్నాయని ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని అతి తక్కువ ధరలకు నాణ్యమైన వస్తువులు సొంతం చేసుకుంటారని ఆకాంక్షించారు. అనంతరం వరేణ్య యాజమాన్యం వారు మాట్లాడుతూ వారి వద్ద 50 రకాల కేటగిరీలలో తమ వద్ద ఐటమ్స్ లభిస్తాయని అన్ని రకాల కూడా ప్రీమియం క్వాలిటీతో అతి తక్కువ ధరలకు లభిస్తాయని తెలియజేశారు. ప్రారంభోత్సవం సందర్భంగా మే 9, 10, 11 తేదీలలో 10000 పైబడి కొనుగోలు చేసిన వారికి 10% డిస్కౌంట్, 15000 పైబడి కొనుగోలు చేసిన వారికి 15% డిస్కౌంట్, 20,000 పైబడి కొనుగోలు చేసిన వారికి 20% డిస్కౌంట్, 25000 పైబడి కొనుగోలు చేసిన వారికి 25% డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలియజేశారు. ఈ సదవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకొని తక్కువ ధరలకు నాణ్యమైన వస్తువులు పొందగలరని అదేవిధంగా తమ వ్యాపార అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పిన్నింటి సంపత్ కుమార్, పిన్నింటి శ్రీనివాసరావు, పిన్నింటి కమల కుమారి, పిన్నింటి నవీన్ కుమార్, బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సహకార శాఖలో పారదర్శకంగా ప్రమోషన్లు, పోస్టింగులు

– ఉద్యోగులకు సమయానికి పదోన్నతులు – వారి ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది – వ్యవసాయ,సహకార శాఖల మంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *