Breaking News

తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఐఏఎస్ దంపతులు

తిరుచానూరు, తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి – తిరుమల రెండు రోజుల పర్యటన నిమిత్తం విచ్చేసిన భారత ప్రధాన ఎన్నికల కమిషనర్  జ్ఞానేష్ కుమార్ ఐఏఎస్ దంపతులు శనివారం తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న వారికి ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికి, ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వేద పండితులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. “కుటుంబ ఓటర్లందరికీ ఇది ఒక కొత్త దినం. విజయవంతమైన ఎన్నికల నిర్వహణకు ఇది నూతన ఆరంభంగా భావిస్తున్నాను. ప్రతి ఓటరు ప్రజాస్వామ్య బలోపేతానికి భాగస్వామి కావాలి,” అని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ఐఏఎస్, తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు, జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు, టిటిడి సిబ్బంది ఇతర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

తీవ్ర వాయుగుండం నేపథ్యంలో ఆర్‌ & బీ శాఖ అధికారులతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి టెలికాన్ఫరెన్స్‌

-క్షేత్రస్థాయి ఆర్‌ & బీ శాఖ అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి -సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రజల రాకపోకలకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *