కొండ ప్రాంతాల ప్రజలకు అండగా ఉంటాం

-విజయవాడ కొండ ప్రాంతాల ప్రజలకు ఎంపీ చిన్ని శుభవార్త
-ఎమ్మెల్యే ఎంపీస్ మీట్లో జీవో నెంబర్ 30 పై సీఎం కీలక ప్రకటన
-మూడు నెలల్లో కొండ పోరంబోకు ప్రాంతాల్లో స్థలాలు రెగ్యులరైజేషన్ పై జిల్లా యంత్రాంగానికి కీలక ఆదేశాలు
-సీఎంతో జరిగిన మీటింగ్ వివరాలు తెలిపిన ఎంపీ కేశినేని చిన్ని

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ గురునానక్ కాలనీలోని ఎంపీ కార్యాలయంలో ఎంపీ కేశినేని చిన్ని కీలక ప్రకటన చేశారు. కొద్ది రోజుల కిందట జరిగిన ఎమ్మెల్యే ఎంపీస్ మీట్లో జీవో నెంబర్ 30 పై జరిగిన కీలక విషయాలను తెలియజేశారు.

ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ ముందుగా విజయవాడ నగర వాసులు శుభవార్త తెలియజేశారు.కొద్ది రోజుల కిందట జరిగిన ఎమ్మెల్యే ఎంపీ ల సమావేశంలో జీవో నెంబర్ 30 ద్వారా 150 గజాల స్థలాన్ని రెగ్యులర్ చేయమని సీఎంను కోరినట్లు తెలిపారు. దీనికి సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందిస్తూ వెంటనే అధికారులకు సూచనలు చేయడం జరిగింది.మూడు నెలల్లోని కొండ ప్రాంతాల పోరంబోకు ప్రభుత్వ స్థలాలు లో నివాసం ఉంటున్న పేద ప్రజలకు ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు.

కొండ ప్రాంతాల్లో నివసించే వారు విజయవాడలో ఎక్కువగా తూర్పు నియోజకవర్గం పశ్చిమ నియోజకవర్గాల్లో ఎక్కువగా ఉన్నారని అలాంటి వారికి ఇది నిజంగా ఒక గొప్ప శుభవార్త అని తెలియజేశారు.కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని ఇది చేతల ప్రభుత్వమని మరొకసారి నిరూపణ అయిందని ఎంపీ అన్నారు.ఎన్నో ఏళ్లుగా కొండ ప్రాంతాల్లో ఉన్న వారిని ఓటు బ్యాంకు గానే చూసిన పార్టీలు ఉన్నాయి కానీ వారిని ఆదుకున్నది మాత్రం కేవలం కూటమి ప్రభుత్వమేనని ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అని ఎంపీ అన్నారు. త్వరలోనే 30 వేల మంది చిరకాల కోరిక సొంత ఇంటి కలను నెరవేర్చబోతున్నందుకు ఆనందంగా ఉందని తెలుపుతూ ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సహకార శాఖలో పారదర్శకంగా ప్రమోషన్లు, పోస్టింగులు

– ఉద్యోగులకు సమయానికి పదోన్నతులు – వారి ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది – వ్యవసాయ,సహకార శాఖల మంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *