జనసేన పార్టీ నాయకులతో కీలక సమీక్ష సమావేశం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతలో భాగంగా ఉమ్మడి కడప మరియు ఉమ్మడి చిత్తూరు జిల్లాల జనసేన పార్టీ నాయకులతో కీలక సమీక్ష సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో డెలిమిటేషన్ ప్రక్రియ, రాబోయే కమిటీల ఏర్పాటు, సంస్థాగత నిర్మాణ బలోపేతం, ఎన్నికల కార్యాచరణ అంశాలపై విస్తృతంగా చర్చించి సమగ్ర సమీక్ష చేపట్టారు. అనంతరం వన్ టూ వన్ విధానంలో ప్రత్యేక చర్చలు నిర్వహించబడ్డాయి.
జనసేన నాయకులు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి సమావేశంలో ప్రసంగిస్తూ స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాన్ని వివరించారు. సమావేశం అనంతరం ఆయన నియోజకవర్గ నాయకులతో వన్ టూ వన్ విధానంలో ప్రత్యేకంగా చర్చలు నిర్వహించి, ప్రతి నియోజకవర్గ నాయకుడి అభిప్రాయాలు, సూచనలు స్వీకరించారు. క్షేత్రస్థాయి పరిస్థితులను సమగ్రంగా పరిశీలిస్తూ, సమన్వయంతో కూడిన కార్యాచరణ ద్వారా ఎన్నికల సన్నద్ధతను బలోపేతం చేయాలని సూచించారు. ఆయన నిర్వహించిన వన్ టూ వన్ చర్చలు సమావేశంలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
తిరుపతి శాసనసభ్యులు ఆరాణి శ్రీనివాసులు మాట్లాడుతూ డెలిమిటేషన్ ప్రక్రియను పరిగణలోకి తీసుకుని బలమైన సంస్థాగత నిర్మాణం ఏర్పాటుచేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ సమావేశంలో ప్రసంగిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలకు సమగ్ర ప్రణాళికతో సిద్ధమవ్వాలని పేర్కొన్నారు. జిల్లా స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు కమిటీలు సమర్థవంతంగా ఏర్పాటు చేసి సంస్థాగత బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు. క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణాన్ని మరింత బలపరచాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు. అహుడా చైర్మన్ టీసీ వరుణ్ కమిటీల ఏర్పాటు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలని పేర్కొన్నారు.
కడప జిల్లా అధ్యక్షులు సుంకర శ్రీనివాసులు జిల్లాలో పార్టీ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేస్తూ సమన్వయంతో ముందుకు సాగాలని తెలిపారు.
ఈ సమావేశంలో రాష్ట్ర, ఉమ్మడి జిల్లాల, నగర మరియు నియోజకవర్గ స్థాయి నాయకులు పాల్గొన్నారు. సమావేశం నిర్మాణాత్మక చర్చలతో సానుకూల వాతావరణంలో ముగిసింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సహకార శాఖలో పారదర్శకంగా ప్రమోషన్లు, పోస్టింగులు

– ఉద్యోగులకు సమయానికి పదోన్నతులు – వారి ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది – వ్యవసాయ,సహకార శాఖల మంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *