Breaking News

అంతర్జాతీయ ఎయిడ్స్ కొవ్వొత్తుల స్మారక దినోత్సవాన్ని విజయవంతం చేయండి…

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
అంతర్జాతీయ ఎయిడ్స్ కొవ్వొత్తుల స్మారక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం జిల్లా కేంద్రమైన తిరుపతి లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బాలకృష్ణనాయక్ గారు , జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మండలి అధికారి డాక్టర్ శైలజ గారు, ఉమ్మడి జిల్లాల ఎయిడ్స్ నియంత్రణ క్లస్టర్ ప్రోగ్రామ్ అధికారి కోటి రెడ్డి గారు ఓ ప్రకటనలో తెలిపారు. తిరుపతి DM&HO కార్యాలయం నుండి సాయంత్రం 6 గంటలకు క్యాండిల్ లైట్ కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. కొవ్వొత్తులు వెలిగించి మౌన ర్యాలీగా Mahati Auditorium వరకు ర్యాలీ నిర్వహించి, ఎయిడ్స్ కారణంగా మరణించిన వారి ఆత్మశాంతి కోసం మౌనం పాటించి నివాళులు అర్పించనున్నట్లు పేర్కొన్నారు.
ప్రతి సంవత్సరం మే మూడవ ఆదివారం ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా జరుగుతోందన్నారు. కార్యక్రమానికి జిల్లా వైద్య అధికారులు, వైద్య సిబ్బంది, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ వైద్యశాలలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రుల్లో కూడా అంతర్జాతీయ ఎయిడ్స్ కొవ్వొత్తుల స్మారక దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *