తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
వక్ఫ్ ఎడ్యుకేషన్ మిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన “తాలీమ్-ఎ-హునర్ టాలెంట్ టెస్ట్–2026” పరీక్షను ఆదివారం తిరుపతి జిల్లాలో విజయవంతంగా నిర్వహించినట్లు జిల్లా మైనారిటీస్ సంక్షేమ అధికారి కె. చిన్నారెడ్డి తెలిపారు.
జిల్లాలోని రెండు పరీక్షా కేంద్రాలలో మొత్తం 467 మంది అభ్యర్థులకు పరీక్ష నిర్వహించగా, అందులో 405 మంది హాజరై 86.72 శాతం హాజరు నమోదైందన్నారు. 62 మంది గైర్హాజరైనట్లు తెలిపారు.
పరీక్షా కేంద్రాల వారీగా ఎస్‌పీజేఎన్‌ఎం మున్సిపల్ హై స్కూల్, సరోజినీదేవి రోడ్, తిరుపతిలో 251 మందికి పరీక్ష నిర్వహించగా 211 మంది హాజరై 40 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. అలాగే టీపీపీఎం కార్పొరేషన్ మున్సిపల్ హై స్కూల్, టాటా నగర్, తిరుపతిలో 216 మందికి పరీక్ష నిర్వహించగా 194 మంది హాజరై 22 మంది గైర్హాజరయ్యారని వివరించారు.
జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, ఐ.ఏ.ఎస్ గారి ఆదేశాల మేరకు పరీక్షలను ప్రశాంత వాతావరణంలో, అన్ని ఏర్పాట్ల మధ్య సజావుగా నిర్వహించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని జిల్లా మైనారిటీస్ సంక్షేమ అధికారి శ్రీ కె. చిన్నారెడ్డి పర్యవేక్షించగా, APSMFC ED శ్రీ హరినాథ్ రెడ్డి మరియు వక్ఫ్ బోర్డ్ ఇన్‌స్పెక్టర్ శ్రీ వసీం కేంద్ర ఇన్‌చార్జిలుగా విధులు నిర్వహించారు.
Prajavartha Online Telugu News