Breaking News

సంక్షేమం, అభివృద్ధికి కూటమి తొలి ప్రాధాన్యం

– గత ఐదేళ్లు ప్రజల ధన మాన ప్రాణాలకు రక్షణ కరువైంది
– పరిశ్రమలు, పెట్టుబడులతో రాష్ట్రాభివృద్ధి పరుగులు పెట్టిస్తున్నాం
– ఆర్ధిక ఇబ్బందులున్నా సంక్షేమాన్ని సక్రమంగా అమలు చేస్తున్నాం
– ప్రభుత్వం చేసిన మంచిని ప్రతి గడపకూ చేర్చాలని మంత్రి కొల్లు రవీంద్ర పిలుపు

కర్నూలు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమం బాటలో నడిపించేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా జొన్నగిరి జియో మైసూర్ గోల్డ్ మైన్స్ పరిశీలించిన అనంతరం ఎమ్మెల్యే కె.ఇ.శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో జొన్నగిరిలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఎంతో మంది నాయకులు వచ్చారు. వీడారు. కానీ ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని కష్టాలు వచ్చినా తెలుగుదేశం పార్టీ జెండాను ఎప్పుడూ కార్యకర్తలు వీడలేదు. అంతటిఅభిమానం, ధైర్యం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో మాత్రమే సాధ్యం అన్నారు.

రాష్ట్రానికి తలమానికంగా జియో మైసూర్ గోల్డ్ మైన్స్ నిలవబోతోంది. దేశంలో అనేక ప్రాంతాల్లో గోల్డ్ మైన్స్ ఉన్నప్పటికీ.. ప్రైవేట్ రంగంలో వచ్చిన తొలి గోల్డ్ మైన్ మన రాష్ట్రంలోనే ఉండడం అదృష్టం అన్నారు. గోల్డ్ మైన్ రావడంతో ఈ ప్రాంతంలో సుమారు 800 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు స్థానికులకు కల్పించడం అభినందనీయం. ప్రస్తుతం రో జుకు కిలో చొప్పున బంగారం ఉత్పత్తి అవుతోంది. భవిష్యత్తులో రోజుకు 5 కిలోల చొప్పున మొత్తంగా 13 వేల టన్నుల బంగారం వెలికి తీయడమే లక్ష్యంగా సంస్థ పని చేస్తోంది.

గత ఐదు సంవత్సరాలు పరిశ్రమలను బెదిరించి కమీషన్ దండుకుంటే.. ప్రస్తుతం కూటమి పాలనలో పరిశ్రమలు, పెట్టుబడులకు పెద్దపీట వేస్తున్నాం. గత రెండేళ్ల కాలంలో దేశం మొత్తంలో వచ్చిన పెట్టుబడుల్లో 25 శాతం పెట్టుబడులు ఏపీకి రావడం రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి నిదర్శనం.

జగన్ రెడ్డి పాలనలో దాడులు, దౌర్జన్యాలు, హత్యలతో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేశారు. ఉద్యోగులు, వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలను రకరకాలుగా హింసించారు. ప్రజలు గత ఐదేళ్ల పాలనలో ఎంతలా విసిగిపోయారో మొన్నటి ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పు నిదర్శనం. రాష్ట్రంలో ఆర్ధిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ అభివృద్ధి దిశగా పాలన సాగిస్తున్నాం. ఎన్ని ఇబ్బందులున్నా సంక్షేమ పథకాలు పక్కాగా అమలు చేస్తున్నాం.

సూపర్ సిక్స్ హామీలను సూపర్ హిట్ చేశాం. హామీ మేరకు పెన్షన్లు అందిస్తున్నాం. పెన్షన్ల కోసమే నెలకు రూ.2700 కోట్లు చొప్పున ఏడాదికి సగటున ఏడాదికి రూ.35 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. త్వరలోనే వితంతు పెన్షన్ కూడా అందించబోతున్నాం. తల్లికి వందనం పథకంతో ప్రతి విద్యార్ధికి రూ.15 వేలు అందించాం. ఉచిత బస్సు, ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాలను పక్కాగా అమలు చేస్తున్నాం. రాష్ట్రంలో ఎక్కడా గుంతలు లేకుండా రోడ్లు నిర్మించాం. సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తున్నాం.

గత ఐదు సంవత్సరాలు జగన్ రెడ్డికి ఫోటోలు వేసుకోవడం, రాళ్లపై బొమ్మలు వేసుకోవడం, రంగులేయడం, తీయడం తప్ప రాష్ట్రంలో చేసిన అభివృద్ధి ఏమీ లేదు. అబద్దాలతో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి.. అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల పేరుతో డ్రామాలాడాడు. ఉచిత ఇసుక పథకాన్ని రద్దు చేసి ప్రైవేటు పేరుతో ఇసుకలో దోచుకున్నాడు. మద్య నిషేధం పేరుతో అధికారంలోకి వచ్చి కల్తీ మద్యంతో ప్రజల్ని దోచుకున్నాడు. చివరికి కూటమి ప్రభుత్వంపై కూడా నిందలేసేందుకు మొలకలచెరువు, ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ తో కల్తీ మద్యం తయారు చేయించారు. ప్రభుత్వాన్ని అస్థిరపరచడం లక్ష్యంగా ప్రజల ప్రాణాలు తీసేందుకు సైతం తెగబడ్డారు.

రాష్ట్రంలో ప్రతి మూడు మద్యం బాటిళ్లలో ఒకటి కల్తీ అని చెప్పిన జగన్ రెడ్డి.. నిరూపించమంటే తప్పించుకుని పారిపోయాడు. చివరికి సొంత చిన్నాన్నను హత్య చేసి.. చంద్రబాబు గారిపై నెట్టేందుకు భారీ ఫోటోలు వేయించాడు. నరకాసుర రక్తచరిత్ర అంటూ కథనాలు వండి వార్చారు. అధికారంలోకి వచ్చాక హంతకులకు వంత పాడాడు. ఇప్పుడు అమరావతి, పోలవరం, రాయలసీమ ప్రాజెక్టులపై విషం చిమ్ముతున్నాడు. మావిగన్ అంటూ పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో మూడు ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యమిస్తోంది. పోలవరం పూర్తయితే అన్ని ప్రాంతాలకు సాగు, తాగునీటి అవసరాలు తీరుతాయని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.

కార్యక్రమంలో పత్తికొండ ఎమ్మెల్యే కె.ఇ.శ్యామ్ కుమార్, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, జిల్లా గ్రంథాలయపరిషత్ ఛైర్మన్ తుగ్గలి నాగేంద్ర తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *