Breaking News

ఆత్మీయ పలకరింపు ఆర్థిక భరోసా లతో అనందహేళ..

-తొలిపొద్దులోనే లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పంపిణీ..
-జిల్లాలో 2,25,887 మంది లబ్ధిదారులకు రూ. 99 కోట్ల పంపిణీ..
-సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. జి. డా.లక్ష్మీశ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన సామాజిక ఆర్థిక భద్రత, జిల్లా కలెక్టర్ ఆత్మీయ పలకరింపులతో లబ్దిదారుల కళ్లలో ఆనందాన్ని నింపాయి. ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ ప్రతి నెలా ఒకటో తేదీనే అందజేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు లబ్ధిదారుల జీవితాల్లో ఆర్థిక భరోసాను కల్పిస్తున్నాయి.
సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా సోమవారం తెల్లవారుజామున జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ సిబ్బందితో కలసి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సర్కిల్`2 పరిధిలోని మారుతీనగర్ 26వ స్వర్ణ వార్డులో లబ్దిదారులకు స్వయంగా పెన్షన్లు పంపిణీ చేశారు. గుడిసేవ సుబ్బారావు, వసంతాల శ్రీనివాసరావు, బత్తుల కృష్ణారావులకు వృద్థాప్య పెన్షన్లు, కోమటి నాగమణికి వితంతు పెన్షన్, బి. బాల మణికంఠ సాయి శ్రీనివాసుకు విభిన్న ప్రతిభావంతుల పెన్షన్లను అందజేశారు.
ఈ సందర్భంగా లబ్దిదారులను ఆప్యాయంగా పలకరిస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కొంత సమయం వారితో గడిపి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ డా. లక్ష్మీశ మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలులో మనరాష్ట్ర దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. సామాజిక భద్రతా పెన్షన్ల ద్వారా వృద్ధులు, వితంతువులు, విభిన్న ప్రతిభావంతులు, డప్పుకళాకారులు మత్స్యకారులు, ట్రాన్స్‌జెండర్లతో పాటు నిరుపేద కుటుంబాలకు ఆర్థిక అండగా కల్పించడం జరిగిందన్నారు. ప్రతి నెల ఒకటో తేదీ వేకువజామునే స్వర్ణ వార్డు సిబ్బంది లబ్దిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి తలుపు తట్టి మరి పెన్షన్లు అందించడంతో వారి ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తోందన్నారు.
జిల్లాలో మొత్తం 2,25,887 మంది లబ్ధిదారులకు 99 కోట్లు 1 లక్ష 45 వేల 500 రూపాయల పెన్షన్ల రూపంలో పంపిణీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు పరిధిలో ఇంటి వద్దకే పెన్షన్లు అందించడం వల్ల లబ్ధిదారులు సౌకర్యవంతమైన సేవలు పొందుతున్నారన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు సమన్వయంతో పనిచేసి పెన్షన్ల పంపిణీ సజావుగా సాగేలా కృషిచేస్తున్నారని ఎక్కడా ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా లబ్ధిదారుల ఇళ్ల వద్దే పెన్షన్ మొత్తాన్ని అందించినట్లు జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.
కార్యక్రమంలో డీఆర్‌డీఏపీడీ ఏ.ఎన్.వి. నాంచారరావు, వీఎంసి జోనల్ కమిషనర్ కె. ప్రభుదాస్, మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *