విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మొగల్రాజపురంలోని బిఎస్ఆర్కేమున్సిపల్ హై స్కూల్ విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం మరియు కెరియర్ గైడెన్స్ పైన విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు యువజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యనిర్వాహణాధికారి డాక్టర్ కొల్లేటి రమేష్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా యువజన సంక్షేమ శాఖ నిర్వహించే అవగాహన కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం మరియు కెరీర్ గైడెన్స్ లో అవగాహన కల్పించాలని ఉద్దేశంతో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువజన సంక్షేమ ముఖ్య కార్యనిర్వాహణాధికారి డాక్టర్ కొల్లేటి రమేష్ మాట్లాడుతూ విద్యార్థులు మంచి అలవాట్లు కలిగి ఉండాలని, ప్రతి విద్యార్థి క్రమశిక్షణ మరియు విలువల తో కూడిన విద్యనభ్యసించాలని, మంచి అలవాట్లను అలవర్చుకోవాలని తెలిపారు. కార్యక్రమానికి విచ్చేసిన రిసోర్స్ పర్సన్ గా ప్రముఖ యాంకర్ శ్రీమతి చంద్రిక విద్యార్థుల ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులు మానసికస్థైర్యం తో పాటు క్రమశిక్షణ పట్టుదల నిజాయితీ మంచి అలవాట్లు ప్రతి ఒక్క విద్యార్థి నేర్చుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్మాస్టర్ యువజన సంక్షేమ శాఖ కార్యాలయ సూపరిండెంట్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ మేనేజర్ వెంకటేష్, అభిజ్ఞ, డాక్టర్ సునీల్ కుమార్ ఆఫీస్ సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News