గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఓటరు ప్రత్యేక సవరణ (సర్) కార్యక్రమాన్ని ఈ నెల 24వ తేదీ వరకు పొడిగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించిందని గుంటూరు నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ కె.మయూర్ అశోక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పొడిగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం సర్ ప్రక్రియకు రివైజ్డ్ షెడ్యూల్ జారీ చేసిందని, బూత్ స్థాయి అధికారులు ఈ నెల 24వ తేదీ వరకు ఇంటింటికి సందర్శిస్తారని తెలిపారు. జూలై 31వ తేదీన ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురించడం జరుగుతుందని, జూలై 31వ తేది నుండి ఆగస్టు 30వ తేదీ వరకు క్లెయిమ్ లు, అభ్యంతరాలు స్వీకరించడం జరుగుతుందని పేర్కొన్నారు. సెప్టెంబర్ 28వ తేదీ లోగా క్లెయిమ్ లు, అభ్యంతరాలు పరిష్కరించడం జరుగుతుందని, అక్టోబర్ 3వ తేదీన తుది ఓటరు జాబితాను ప్రచురించడం జరుగుతుందని తెలిపారు. జూలై 24వ తేదీ వరకు పోలింగ్ కేంద్రాల మార్పు, హేతుబద్ధీకరణ చేయుటకు అవకాశం ఉందన్నారు. కనుక నగరంలోని ఓటర్లు ఇంకా ఎవరైనా ఎన్యూమరేషన్ ఫారాలు నింపి ఇవ్వకుంటే వెంటనే బిఎల్ఓలకు అందించాలని, బిఎల్ఓలు కూడా ఎప్పటికప్పుడు ఫారాలను డిజిటైజ్డ్ చేయాలని ఆదేశించారు.
Prajavartha Online Telugu News