Breaking News

అండర్ గ్రౌండ్ డ్రైనేజి కార్మికుల సంక్షేమానికి తగిన చర్యలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ అండర్ గ్రౌండ్ డ్రైనేజి కార్మికుల సంక్షేమానికి తగిన చర్యలు తీసుకుంటామని, వారికి హెల్త్ కార్డ్ లు, విధుల్లో అవసరమైన సబ్బులు, కొబ్బరినూనె వంటి వాటిని అందిస్తామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. మంగళవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ లో మురుగు నీటి శుద్ధీకరణ యాంత్రీకరణపై స్కిల్ కౌన్సిల్ ఆఫ్ గ్రీన్ జాబ్స్ అందించిన శిక్షణ అనంతరం కార్మికులకు సర్టిఫికెట్లను కమిషనర్ అందించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకో సిస్టం (నమస్తే) పధకంలో భాగంగా గుంటూరు నగరపాలక సంస్థలో అండర్ గ్రౌండ్ డ్రైనేజి విధులు చేపట్టే కార్మికులకు ఇటీవల శిక్షణ జరిగిందని, వారికి మంగళవారం నమస్తే డే పురస్కరించుకొని సర్టిఫికెట్లను అందిచామని తెలిపారు. పారిశుధ్య విధుల్లో కఠినమైన అండర్ గ్రౌండ్ డ్రైనేజి పనులని, సదరు విధులు నిర్వహించే కార్మికుల ఆరోగ్య రక్షణకు ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ప్రస్తుతం వారికి హెల్త్ కార్డ్ లు, అవసరమైన వస్తువులు అందించడానికి చర్యలు తీసుకుంటామన్నారు.
కార్యక్రమంలో సిఎంఓహెచ్ డాక్టర్ శాంతికళ, ఎంహెచ్ఓ డాక్టర్ సురేష్, అనిల్ కుమార్ పాల్గొనారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పోలవరానికి పర్యాటక శోభ

-ప్రాజెక్టుతో పాటు గోదావరి తీరంలో టూరిజం అభివృద్దికి మాస్టర్ ప్లాన్ -అఖండ గోదావరి ప్రాజెక్టు కింద నదీతీరం అభివృద్ది -అధికారులు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *