విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ పి.బి. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల బి.ఎ. ఎకనామిక్స్ విద్యార్థులు ఉదార హృదయంతో విరాళంగా అందచేసిన 12 వేల రూపాయలతో పెన్నులు, పెన్సిళ్లు, జామెట్రీ బాక్సులు, రైటింగ్ ప్యాడ్స్ వగైరా కిట్ లను ఆర్థికశాస్త్ర విభాగం పక్షాన సూర్యారావుపేటలోని కర్నాటి రామ్మోహనరావు మున్సిపల్ స్కూలులో పదోతరగతి విద్యార్థులకు మంగళవారం ఉచితంగా పంపిణీ చేసినట్లు అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.రోహిణి కుసుమ తెలిపారు. కర్నాటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. సూర్యప్రభ సమక్షంలో టెన్త్ విద్యార్థులకు ఈ కిట్ లను అందచేశారు.
ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకుడు ఎస్.సురేశ్ కుమార్, ఫిజికల్ డైరెక్టర్ జె. వెంకట్, భౌతికశాస్త్ర ఉపాధ్యాయులు ఎస్.వి. శ్యాంప్రసాద్, సిద్ధార్థ విద్యార్థులు భువన,శ్యాం, సలీం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తోటి విద్యార్థులకు సాయం చేసేందుకు ముందుకు వచ్చిన బి.ఎ. ఎకనామిక్స్ విద్యార్థి బృందాన్ని ప్రిన్సిపాల్ డా. మేకా రమేష్ అభినందించారు.
Prajavartha Online Telugu News