

-ఆలయ ఉపాసకురాలు తమ్మిన రవీణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీ శ్రీ శ్రీ గంగానమ్మ దుర్గ మారెమ్మ విశ్వేశ్వర దేవస్థానం వ్యవస్థాపకురాలు, ఆలయ ఉపాసకురాలు తమ్మిన రవీణ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్తీక మాసం సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు, భక్తులచే భజన కార్యక్రమాలు, అన్న సంతర్పణ వితరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా తమ్మిన రవీణ మాట్లాడుతూ గత 20 సంవత్సరాల స్థాపించిన ఈ దేవాలయాన్ని స్వశక్తితో, అమ్మవారి అనుగ్రహంతో దినదినాభివృద్ధి చేస్తూ భక్తులను అనుగ్రహ పాత్రులను చేయడానికి కృషి చేస్తున్నానన్నారు. భవిష్యత్తులో దేవస్థానాన్ని మరింత అభివృద్ధి పరిచి, దైవ కార్యక్రమాలు మరింత అంగరంగ వైభవంగా నిర్వహించడానికి సాయశక్తులా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో తమ్మిన రవీణ భక్త బృందం, భారీ పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News