Breaking News

వైఎస్ జగన్ స్పూర్తితో సామాజిక సేవ కార్యక్రమాలు : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని 13వ డివిజన్ నందు ఉకోటి అన్నపూర్ణమ్మ చారిటిబుల్ ట్రస్ట్ ద్వారా స్థానిక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ ఇన్ ఛార్జ్ ఉకోటి రమేష్  దాదాపు 50వేల రూపాయల సొంత నిధులతో తయారుచేపించిన టిఫిన్ బండ్లు, తోపుడు బండ్లు పంపిణీ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ తో కలిసి పాల్గొని నలుగురు నిరుపేద కుటుంబాలకు జీవనోపాధి నిమిత్తం అందజేసిన నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్.అదేవిధంగా పనసా లక్ష్మీ చదువు కొరకు 5000 రూపాయల నగదును అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్ రెడ్డి ని ఆదర్శంగా తీసుకొని ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మా దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రాజకీయలకతీతంగా విద్య,వైద్య,ఉపాధి రంగాలలో మా శక్తి మేర సేవ కార్యక్రమాలు చేపడుతున్నాం అని అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ సొంత నిధులతో ఇలాంటి సామజిక సేవ కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు అండగా నిలవడం గర్వకారణం అని అన్నారు.ఈ కార్యక్రమంలో స్టాండింగ్ కమిటీ మెంబెర్ తంగిరాల రామిరెడ్డి ,డివిజన్ అధ్యక్షులు రమాయనపు శ్రీనివాస్,మాగంటి నవీన్, చింతల సాంబయ్య, వైస్సార్సీపీ నాయకులు కోలా ఉమ,కిషోర్,చిమాటా బుజ్జి, ముక్కు వెంకటేశ్వర రెడ్డి, కాళేశ్వరవు,రిజ్వాన్,శేటికం దుర్గ,మల్లి, శ్రీనివాస్,మధు,ప్రకాష్,విజయ్,రవి, తోటవారి స్ట్రీట్ అసోషియేషన్ మరియు డివిజన్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *