Breaking News

గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే స్కానింగ్ కేంద్రాలపై ” డెకాయ్ ఆపరేషన్స్” : ఆర్డీఓ కె. రాజ్యలక్ష్మి

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త :
గర్భస్థ పిండం లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే స్కానింగ్ కేంద్రాలపై”డెకాయ్ ఆపరేషన్స్” నిర్వహించాలని రెవిన్యూ డివిజినల్ అధికారి కె. రాజ్యలక్ష్మి వైద్యాధికారులను ఆదేశించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన గర్భస్థ పిండ లింగనిర్ధారణ నియంత్రణ డివిజన్ స్థాయి సమావేశం ఆర్డీఓ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రాజ్యలక్ష్మి మాట్లాడుతూ గర్భస్థ పిండం లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం చట్టరీత్యా నేరమన్నారు. వైద్య శాఖ సిబ్బంది తో స్కానింగ్ కేంద్రాలపై డెకాయ్ ఆపరేషన్స్ నిర్వహించి ఎవరైనా గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు గుర్తించినట్లయితే వెంటనే సంబంధిత డాక్టర్లు, కేంద్రాల నిర్వాహకులు పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. డెకాయ్ ఆపరేషన్స్ నిర్వహించేందుకు అవసరమైన సిబ్బందిని గుర్తించి, వారికి అవసరమైన రహస్య కెమెరాలు, మొదలైన పరికరాలు అందించాలన్నారు. లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు రుజువైతే మూడు సంవత్సరాల కారాగార శిక్షతో పాటు, పదివేల రూపాయలు జరిమానా విధించడం జరుగుతుందని రెండో సారి కూడా లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు రుజువైతే సంబంధిత వైద్య అధికారికి మెడికల్ కౌన్సిల్ సభ్యత్వం రద్దు చేయడంతోపాటు స్కానింగ్ సెంటర్ లైసెన్సు రద్దు చేసి వారిద్దరిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. గర్భస్థ పిండం లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహించే స్కానింగ్ కేంద్రాలు సమాచారం ఎవరికైనా తెలిస్తే వెంటనే తనకు గాని లేదా దగ్గరలోని వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూ, పోలీస్ శాఖల సిబ్బందికి తెలియజేసి సహకరించాలన్నారు సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు. గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం నేరం అనే అంశాన్ని అందుకు సంబంధించిన చట్టపరమైన వివరాలను ప్రతి స్కానింగ్ కేంద్రంలోనూ తప్పనిసరిగా ప్రదర్శించాలన్నారు. ఈ చట్టం పటిష్టంగా అమలు జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, అంతేకాక ఈ చట్టంపై ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు అవగాహన కలిగించినప్పుడే చట్టం అమలు అసలు ఉద్దేశ్యం నెరవేరుతుందన్నారు. సమావేశంలో డిప్యూటీ డి.ఎం.హెచ్.ఓ, డా.డి.ఆశ, ఇంచార్జి డిఎస్పీ ప్రసన్న వీరయ్య గౌడ్ నూజివీడు ఏరియా హాస్పిటల్ సూపర్నెంట్ డా. నరేంద్ర సింగ్, సబ్ కలెక్టర్ కార్యాలయం డివిజినల్ పరిపాలనాధికారి ఎం. హరినాధ్, వైద్యాధికారులు డా.నరేంద్ర, ప్రభృతులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నాబార్డు క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

-2026-27 సంవత్సరానికి రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళిక అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాబార్డు క్రెడిట్ ప్లాన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *