Breaking News

అట్టడుగు వర్గాల అభ్యున్నతికై శ్రమించిన అంబేద్కర్…

-ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి నాగ వెంకట మోహనరావు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయిడని ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి నాగ వెంకట మోహన రావు కొనియాడారు. బాబా సాహేబ్ వర్థంతి సందర్భంగా విజయవాడ ఆప్కో కేంద్ర కార్యాలయం ఆవరణలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా చిల్లపల్లి మాట్లాడుతూ అంబెడ్కర్ గొప్పదనం అజరామరమని, న్యాయవాది, ఆర్థిక వేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త ఇలా పలు పాత్రలతో బహుముఖ ప్రజ్ఞశాలిగా కీర్తించబడ్డారన్నారు. అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఆయన చేసిన కృషి ఎంచదగినదన్నారు. కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ సంయిక్త సంచాలకులు, ఆప్కో జిఎం కన్నబాబు, ఉపసంచాలకులు మురళీ కృష్ణ, ఆప్కో సీనియర్ మార్కెటింగ్ అధికారి రమేష్ బాబు, ప్రత్యేక అధికారి జగదీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యన్.టి.ఆర్ క్రీడాప్రాంగణం సంక్రాంతి సంబరాల పోటీల రిజిస్ట్రేషన్ కు శనివారం సాయంత్రం వరకు గడువు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పండుగ, ఈ సందర్భంగా నగర పాలక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *