-అర్హులైన ఉపాధ్యాయులు వెంటనే ఫారం-19 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
-ERO, కృష్ణా-గుంటూరు ఉపాధ్యాయ నియోజకవర్గం & జిల్లా రెవెన్యూ అధికారి, గుంటూరు: ఎన్.ఎస్.కె. ఖాజావలి
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
కృష్ణా-గుంటూరు ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అర్హులైన ఉపాధ్యాయులు ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు రేపు (నవంబర్ 06, 2026) చివరి తేదీ అని ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి (ERO), కృష్ణా-గుంటూరు ఉపాధ్యాయ నియోజకవర్గం మరియు జిల్లా రెవెన్యూ అధికారి, గుంటూరు ఎన్.ఎస్.కె. ఖాజావలి తెలిపారు.
ప్రతి ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఓటర్ల జాబితాను కొత్తగా రూపొందించడం జరుగుతుందని, గతంలో ఓటర్లుగా నమోదైన ఉపాధ్యాయులు సైతం ప్రస్తుత ఎన్నికల కోసం కొత్తగా ఫారం-19 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. కాబట్టి అర్హత కలిగిన ఉపాధ్యాయులందరూ గడువు ముగిసేలోగా తమ దరఖాస్తులను సమర్పించాలని సూచించారు. గత ఎన్నికల సమయంలో 13,505 మంది ఉపాధ్యాయులు ఓటర్లుగా నమోదు కాగా, ప్రస్తుత నమోదు ప్రక్రియలో ఇప్పటివరకు 10,909 దరఖాస్తులు మాత్రమే అందాయని తెలిపారు. గత ఎన్నికల గణాంకాలతో పోలిస్తే ఇంకా సుమారు 2,600 మందికి పైగా అర్హులైన ఉపాధ్యాయులు ఓటర్లుగా నమోదు కావాల్సి ఉందని పేర్కొన్నారు.
ప్రభుత్వ మరియు ప్రైవేట్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న అర్హులైన ఉపాధ్యాయులందరూ రేపు (నవంబర్ 06వ తేదీ) లోగా ఫారం-19 ద్వారా ఓటర్లు
